బహుజన సమాజ్ పార్టీ (BSP) అధ్యక్షరాలు మాయావతి తన రాజకీయ వారసుడిగా తన మేనల్లుడైన ఆకాష్ ఆనంద్ పేరును ప్రకటించారు. ఆదివారం జరిగిన బహుజన్ సమాజ్ పార్టీ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
BSP: తన రాజకీయ వారసుడిని ప్రకటించిన మాయావతి.. ఎవరంటే..
బహుజన సమాజ్ పార్టీ (BSP) అధ్యక్షరాలు మాయావతి తన రాజకీయ వారసుడిగా తన మేనల్లుడైన ఆకాష్ ఆనంద్ పేరును ప్రకటించారు. ఆదివారం జరిగిన బహుజన్ సమాజ్ పార్టీ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కొంతకాలం నుంచి ఆకాష్ ఆనంద్ BSP పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా వ్యవహరించడం జరుగుతుంది. మాయావతి తర్వాత తన తమ్ముడి కుమారుడైన ఆకాష్ ఆనంద్ పార్టీ పగ్గాలను చేపట్టనున్నారు. 2016లో బీఎస్పీలో చేరిన ఆనంద్ ఆకాష్ 2019వ సంవత్సరంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పార్టీ తరపున పాల్గొన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చేపట్టిన స్వాభిమాన్ సంకల్ప యాత్రలో ఈయన కీలకమైన పాత్ర పోషించారు..
2024 లోక్సభ ఎన్నికలకు ముందు తన రాజకీయ వారసుడిగా ఆకాష్ ఆనంద్ ని ప్రకటించడం పై పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.. మాయావతి తర్వాత పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారనే చర్చకు ఈ ప్రకటన ద్వారా ముగింపు పలికినట్లు అయింది.