ఏపీ: గత నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్లో 5,936 డెంగీ కేసులు నమోదైనట్లు కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బగేల్ లోక్ సభలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెంగీతో ఒక్కరు కూడా మరణించలేదని తెలిపారు.
ఏపీలో డెంగీ మరణాలు ఎన్నంటే...
ఏపీ: గత నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్లో 5,936 డెంగీ కేసులు నమోదైనట్లు కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బగేల్ లోక్ సభలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెంగీతో ఒక్కరు కూడా మరణించలేదని తెలిపారు.తెలంగాణలో 2021-2023 నవంబర్ వరకు 7894 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ఒకే ఒక్క మరణం సంభవించినట్లు వెల్లడించారు.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు రెండు లక్షల 234,427 మందికి డెంగ్యూ సోకినట్లు 274 మంది మరణించినట్లు తెలిపారు.. వర్షాకాలం, శీతాకాలంలో డెంగ్యూ దోమల కారణంగా డెంగ్యూ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుంది.. ఒకప్పుడు డెంగీ మరణాల సంఖ్య ఎక్కువగా ఉండేది.. క్రమంగా డెంగీ పట్ల ప్రజల్లో అవగాహన పెరగడం సరయిన చికిత్స విధానాలు అందుబాటులోకి రావడంతో డెంగ్యూ మరణాలు తగ్గినట్లు తెలిపారు..