Movies: పుష్ప 2 సినిమాలో సగం బడ్జెట్ దానికేనా!!

Written by Rudra

Published on:

మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా “పుష్ప- 2” థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు హైప్ అయితే అదిరిపోయేలా ఉంది.  పెరిగిన టికెట్లు రేట్లు కూడా  ప్రేక్షకులు బెంబేలెత్తేలా ఉన్నాయి.  దీనిపై విమర్శలు కూడా వచ్చాయి.  అయితే దీని ప్రభావం టికెట్లు బుకింగ్ లో మాత్రం ఏ మాత్రం కనబడలేదు.

Mobile: iQOO 13 ఫీచర్లు అదిరాయి

టికెట్లు బుకింగ్ మాత్రం భారీగానే జరిగింది. పుష్ప మొదటి భాగం అప్పుడు ఇది తెలుగు రాష్ట్రాలు మహా అయితే కేరళ వరకు మాత్రమే దీని గురించి ప్రచారం ఉంది.  కానీ ఇది నార్త్ లో కూడా మంచిగానే హిట్ అయి మంచి కలెక్షన్ రాబట్టింది.  దీని వలన సెకండ్ పార్ట్ పై దీని ప్రభావం ఉండి బడ్జెట్ భారీగా పెరగడంతో టికెట్లు రేట్స్ కూడా పెంచవలసిందిగా నిర్మాతలు చెప్తున్నారు.  పుష్ప 1  సినిమాకి అల్లు అర్జున్ కి  జాతీయ అవార్డు రావడంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతంగా పెరిగాయి.

బన్నీ మాత్రం ఈ సినిమాకు షేర్ తీసుకోవడం వల్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లు  దాటేసింది.  250 నుంచి 280 కోట్లు మధ్యలో బన్నీకి పారితోషంగా ఇచ్చాడని సమాచారం ఉందిఈ సినిమాకి డైరెక్టర్ సుకుమార్ కి 100 కోట్లు పైనే రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తుంది.  మిగిలిన నటులలో రష్మికకు పది కోట్లు… ఐటెం సాంగ్ లో శ్రీలీలకు రెండు కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తుంది.  సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ 5 కోట్లు  ఇచ్చారట.  ఇంకా దీనిలో రావు రమేశ్, జగపతిబాబు, సునీలు, అనసూయ, అజయ్ లాంటి వాళ్లకు భారీగానే రెమినేషన్ ఇచ్చినట్టు  తెలుస్తుంది. ఈ  లెక్కన చూసుకుంటే మొత్తం 600 కోట్ల వరకు ఈ సినిమాకు బడ్జెట్ అయిందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో సగం బడ్జెట్ రెమ్యునరేషన్లకు ఉండడం వల్ల బడ్జెట్ భారీగా పెరిగింది.  అయితే టికెట్ల రేట్లపై విమర్శలు బాగా వస్తున్నాయి.  సామాన్య ప్రేక్షకులు సినిమా చూడాలంటే భారీగా ఖర్చు పెట్టవలసి వస్తుంది.

Leave a Comment