health: తిన్న వెంటనే నిద్ర ముంచుకు వస్తే .. అది ఏ వ్యాధికి సంకేతం..

Written by Rudra

Published on:

రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోయినా, నిద్ర పట్టకపోయినా పగలు నిద్ర రావడం సహజంగానే జరుగుతుంది. కానీ పగటి పూటే అన్నం తిన్న తర్వాత విపరీతంగా నిద్ర రావడం దేనికి సంకేతంగా భావిస్తారో మీకు తెలుసా..!  దీన్నే వైద్య పరిభాషలో “ఫుడ్ కోమ” అని పిలుస్తారు. ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్న చాలామంది ఎంత పనిలో ఉన్నా నిద్రను ఆపుకోలేక పోతారు. కళ్ళు మూతలు పడిపోతాయి.. చాలామంది ప్రస్తుతం ఇలాంటి సమస్యని ఎదుర్కొంటున్నారు. దీని నుండి బయట పడేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు..

health: తిన్న వెంటనే నిద్ర ముంచుకు వస్తే .. అది ఏ వ్యాధికి సంకేతం..

పగటి పూటఎక్కవ  తినడం ..  బిర్యానీలు, సమోసాలు, కేకులు, బర్గర్లు వంటి జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల “ఫుడ్ కోమా” ఏర్పడుతుంది. దీనివల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. వీటిని అరిగించడానికి రక్తం సరఫరా పెరుగుతుంది. దీనివల్ల బద్ధకం రావడం దానివల్లనే ఫుడ్ కోమా కి దారి తీయడం జరుగుతుంది.

ఫాస్ట్ ఫుడ్ లో జంక్ ఫుడ్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల డే టైం లో బ్లడ్ షుగర్స్ పెరుగుతాయి. నిద్ర ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇది క్రమంగా ఫుడ్ కోమాకు దారి తీస్తుంది. వీటిని నివారించాలంటే లంచ్ టైం లో ఫైబర్ ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం వంటివి చేయాలి

ఫుడ్ కోమా రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు..

  • ఫుడ్ కామన్ తగ్గించాలంటే లంచ్ లో తక్కువ భోజనం చేయాలి.
  • ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.
  • జంగ్ ఫుడ్, కార్బో హైడ్రేడ్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోకూడదు.
  •  త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.
  •  ఫైబర్ మరియు ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలి.
  •  ప్రశాంతంగా కూర్చుని తినాలి.
  •  తిన్న తర్వాత కొంచెం శారీరక శ్రమ అంటే కొద్దిదూరం నడవడం వంటి చేయాలి.

 

Leave a Comment