త్వరలో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్చార్జుల మార్పులో భాగంగా YSR కాంగ్రెస్ పార్టీ తన మూడవ జాబితాను ఈరోజు విడుదల చేసింది.. మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు, ఆరు పార్లమెంట్ స్థానాలకు.. మొత్తం 21 మంది ఇన్‌ఛార్జిల పేర్లను ప్రకటించింది. ఈరోజు తాడేపల్లిలో పార్టీ సీనియర్ నేత మరియు విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వివరాలను మీడియాకు వెల్లడించారు..
ysrcp : 21 స్థానాలకు మూడవ జాబితా విడుదల చేసిన వైయస్ఆర్సీపీ
శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు జిల్లాలపై ప్రధానంగా ఫోకస్ చేసినట్లు బాగా కనిపిస్తుంది.. ఎస్సీ, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ మూడో జాబితాను రూపొందించడం గమనార్హం. తొలి జాబితాలో 11 నియోజకవర్గాల్లో, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడో జాబితాను 21 స్థానాలతో విడుదల చేసింది.