ysrcp : 21 స్థానాలకు మూడవ జాబితా విడుదల చేసిన వైయస్ఆర్సీపీ

Written by Rudra

Published on:

త్వరలో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల ఇన్చార్జుల  మార్పులో భాగంగా YSR కాంగ్రెస్ పార్టీ తన మూడవ జాబితాను ఈరోజు విడుదల చేసింది.. మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు, ఆరు పార్లమెంట్‌ స్థానాలకు.. మొత్తం 21 మంది ఇన్‌ఛార్జిల పేర్లను ప్రకటించింది. ఈరోజు తాడేపల్లిలో పార్టీ సీనియర్‌ నేత మరియు విద్యాశాఖామంత్రి  బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వివరాలను మీడియాకు వెల్లడించారు..

ysrcp : 21 స్థానాలకు మూడవ జాబితా విడుదల చేసిన వైయస్ఆర్సీపీ

శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు జిల్లాలపై ప్రధానంగా ఫోకస్‌ చేసినట్లు బాగా కనిపిస్తుంది..  ఎస్సీ, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ మూడో జాబితాను రూపొందించడం గమనార్హం. తొలి జాబితాలో 11 నియోజకవర్గాల్లో, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడో జాబితాను 21 స్థానాలతో విడుదల చేసింది.

సీఎం వైఎస్‌ జగన్‌ “మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాం’’ అని పార్టీ శ్రేణులకు చెబుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే సామాజిక సమీకరణాలు.. అభ్యర్థుల గెలుపోటములను బేరీజు వేసుకున్న తర్వాతనే మార్పులు చేర్పులు చేసినట్లు పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. అయితే టికెట్ రాని కొందరు ఇప్పటికే పార్టీ మారుతున్నారు.. బుజ్జగింపులు పనిచేయడం లేదు.. ఇంకా కొందరు ముఖ్య లీడర్లు 18వ తేదీన తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొనున్నట్లు సమాచారం..

Leave a Comment