భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య గురువారం నాటి నుంచి టి20 సిరీస్ ప్రారంభమవుతుంది. మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో భాగంగా మొట్టమొదటి మ్యాచ్ మొహాలీలో జరగనుంది. ఈ సిరీస్ ఫేవరెట్ గా టీమిండియా బరిలోకి దిగుతుంది.
T- 20: నేటి ఇండియా – ఆఫ్ఘనిస్తాన్ టీ – 20 క్రికెట్ మ్యాచ్ పిచ్ రిపోర్ట్ ఏంటంటే..
భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య గురువారం నుంచి టి20 సిరీస్ ప్రారంభమవుతుంది. మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో భాగంగా మొట్టమొదటి మ్యాచ్ మొహాలీలో జరగనుంది. ఈ సిరీస్ ఫేవరెట్ గా టీమిండియా బరిలోకి దిగుతుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ ని తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ఆఫ్ఘనిస్తాన్ టీం మంచి ప్రదర్శన కనబరిస్తూ గత ప్రపంచకప్ లో సంచలనాలు కూడా నమోదు చేసింది. భారత్ జట్టు కూడా ఆఫ్ఘనిస్తాన్ ని తక్కువ అంచనా వేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.ఇటీవల టి20 జట్టులోకి భారత కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి రావడంతో భారత జట్టు బలంగా కనిపిస్తుంది. అయితే మొదటి మ్యాచ్ మొహాలీ జరుగుతుండగా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కి చేసిన బింద్రా ఇచ్చిన పిచ్ రిపోర్టును ఇలా ఉంది..
మొహాలి పిచ్ బ్యాటింగ్ కే అనుకూలంగా ఉంటుందట. గతంలో ఇక్కడ భారీ స్కోర్ లే నమోదవడం జరిగింది ప్రస్తుత మ్యాచ్లో కూడా భారీ స్కోర్ నమోదు అయ్యే అవకాశం ఉంది. మ్యాచ్ ఆరంభంలో ఫేసర్లకు తర్వాత స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. రెండో ఇన్నింగ్స్ లో చలికాలం కాబట్టి మంచు ప్రభావం ఉండే అవకాశం ఉంది. పైగా నార్త్ ఇండియాలో మంచు ఎక్కువగా కురుస్తుంది. కనుక చేజింగ్ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.
Movies: సంక్రాంతి సినిమాల్లో ఎంత వసూళ్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ వస్తుందంటే..
ఇప్పుడు వరకు మొహాలీలో ఆరు అంతర్జాతీయ టి20 మ్యాచ్ లు జరిగాయి. నాలుగుసార్లు చేజింగ్ చేసిన జట్లే అనగా రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఇందులో 200 పైగా లక్ష్యాలను రెండుసార్లు చేదించడం జరిగింది. ప్రస్తుతం టి20 ముందుగా టాస్ గెలిచిన వాళ్ళు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.. అయితే మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు 200 పైగా పరుగులు సాధిస్తే రెండో జట్టుకి విజయావకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే ఈ మ్యాచ్లో భారత బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలో బలంగా ఉంది.. ఏది ఏమైనా ఇప్పటివరకు ఈ రెండు జట్లూ ఐదుసార్లు తలపడగా నాలుగుసార్లు తలపడగా నాలుగు సార్లు భారత్ గెలిచింది.. ఒక మ్యాచ్లో ఫలితం తేలేదు..
ఈ మ్యాచ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది..