బర్రెలక్కకు మొత్తం ఎన్ని ఓట్లు పడ్డాయో తెలుసా!!
కర్నే శిరీష అనే పేరుగల యువతి బర్రెలక్కగా నిరుద్యోగులు తరపున గళమెత్తినందుకు ఎదురైన పరిస్థితుల వల్ల తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచింది. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి హేమాహేమి అభ్యర్థుల మధ్య పోటీలో నిలిచి పోస్టల్ బ్యాలెట్ లో అగ్రస్థానంలో నిలిచినా EVM ఓట్లలో వెనుకబడింది.
ఈమెకు మొత్తం 5754 ఓట్లు పోలయ్యి నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ఎన్నికల్లో గెలవకపోయినా యావత్ ప్రజల,నెటిజన్ల మనసును గెలిచింది. తన సమస్య మీద గళ మెత్తినందుకు ఎన్నో బెదిరింపులు ఎదురైన వెనక్కి తగ్గకుండా తన సమస్యపై పోరాడేందుకు ఎన్నికల్లో నిలిచి పోరాటం చేసింది. ఈమెను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో యువత రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఎన్నికల బరిలో గెలవకపోయినా ప్రజల మనసును గెలుచకుంది. యువతలో పోరాట స్ఫూర్తిని నింపింది.