థియేటర్లో హిట్ అయిన సినిమా ఓటీటీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఇటీవల థియేటర్లో సూపర్ డూపర్ హిట్ అయిన పొలిమేర-2 విషయంలో కూడా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ తెలియడంతో ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. పొలిమేర సినిమాకు సీక్వెల్ గా అనిల్ విశ్వనాధ్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా పొలిమేర 2. ఇది థియేటర్లో సూపర్ డూపర్ హిట్ అయి దాని రేంజ్ లో మంచి కాలక్షన్స్ రాబట్టింది. తాజాగా డిస్నీప్లస్ హాట్ స్టార్ లో డిసెంబర్ 8 నుంచి ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమ్ చేయనున్నట్లు తెలుస్తుంది.
Related Post