Redmi12c 5G: అదిరిపోయే ఫీచర్లతో అతి తక్కువ ధరకే రెడ్మి 5జీ…

Written by Rudra

Updated on:

అతి తక్కువ ధరలో రెడ్మి 12c 5జీ ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. కొత్తగా 5జీ ఫోన్ తీసుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని నెటిజన్లు అంటున్నారు. మరి ఆ ఫోన్ ధర, ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Redmi12c 5G: ప్రస్తుతం అంతా 5జీ ట్రెండ్ నడుస్తుంది. కాలంతో పాాటు మనం మారాలి. కాబట్టి 4 జీని వదిలేసి అందరూ 5జీకి అప్డేట్ అవుతున్నారు. ఇక సామాన్యులు కూడా 5జీ ఫోన్ కొనాలని ఆశపడ్డా మార్కెట్లో ధరలు చూసి ఆగిపోతున్నారు. అలాంటి వారికోసమే రెడ్మి అద్భుతమైన ఫీచర్లతో సరసమైన ధరకే మీ కలల ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్(Amazon) రెడ్మి 12సి (Amazon Redmi 12 c) ఫోన్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. గతంలో ఎప్పుడు ఇంత డిస్కౌంట్ ఇవ్వలేదు. ఈ స్మార్ట్ ఫోన్(Smart phone) ఎమ్మార్పీ ధర రూ. 13,999 ఉంది. దీన్ని 6,799 రూపాయలకే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.51 శాతం డిస్కౌంట్‌తో రెడ్మి స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ డీల్ కూడా అందుబాటులో ఉంది. ఏకంగా రూ.6450 వరకు డిస్కౌంట్ లు పొందవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్, అమెజాన్ క్రెడిట్ కార్డు (Amazon credit card) ద్వారా ఐదు శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే చాలా తక్కువలోనే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. కేవలం 330 రూపాయలతో ప్రారంభం అవుతుంది. ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే మీడియా టెక్ హీలియో, g85 ప్రాసెసర్, 6.71 ఇంచుల డిస్‌ప్లే, 50 ఎంపీ డ్యుయల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

 

Leave a Comment