బర్రెలక్క నేటి మహాత్మా గాంధీ ఎక్స్ లో ఆర్జివి ట్విట్

Written by Rudra

Published on:

బర్రెలక్క నేటి మహాత్మా గాంధీ

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అవుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరి దర్శకులు ఒక లెక్క ఆర్జీవి ఒక్కరే ఒక లెక్క అన్నట్లు ఉంటారు. ఎందుకంటే తన సినిమాలతో ఆకట్టుకునే దర్శకుల్లో ఆర్జీవీ ఒకరు. కానీ కొన్ని సంవత్సరాలుగా సినిమాలపై కాకుండా రాజకీయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. సోషల్ మీడియాలో టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎక్కువగా విమర్శలు గుప్పిస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటారు.
2019 ఎన్నికల ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ద్వారా టిడిపి పై విమర్శల భాను ఎక్కి పెట్టారు ఇటీవల వ్యూహం సినిమాతో జగన్ బయోపిక్ ద్వారా ముందుకు వస్తున్నారు ఈ సినిమా టిడిపి వర్గాల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇక తాజాగా తెలంగాణ రాజకీయాలను ఒక ఊపు ఊపుతున్న బర్రెలక్క అలియాస్ శిరీష పై ఆర్జీవి ఎక్స్ లో ట్వీట్ చేశారు. తెలంగాణ విద్యార్థిని బర్రెలక్క మనందరికీ సుపరిచితమే. ఎమ్మెల్యేగా నామినేషన్ వేసి ఎన్నికల ప్రచారంలో కూడా అదరగొడుతుంది. ఈమె ప్రచారం సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళుతుంది.. ఈ క్రమంలోనే ఆర్జీవి బర్రెలక్క కోసం ఒక ట్వీట్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బర్రెలక్కను నేటి మహాత్మా గాంధీతో పోల్చి గాంధీజీ అన్యాయానికి వ్యతిరేకంగా తన శాంతియుత ఉద్యమాన్ని బర్రెలకులాగే ప్రారంభించారని ఎక్స్ లో రాసుకోచ్చారు..
ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. నెటిజన్లు కూడా బ్యారెలక్కను సపోర్ట్ చేస్తూ ఆర్జివి ట్వీట్ను సమర్థిస్తున్నారు. ఆర్జీవినా మజాకా..

Leave a Comment