Guturu karam: 24 గంటల్లోనే రికార్డ్స్ తిరగరాసిన గుంటూరు కారం ట్రైలర్..

Written by Rudra

Published on:

మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సంక్రాంతికి వస్తున్న మూవీ గుంటూరు కారం. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలయిన పాటలకు మంచి మార్కులే పడ్డాయి.. కుర్చీ మడత పెట్టి సాంగ్ నెట్ లో హల్ ఛల్ చేస్తుంది.

Guturu karam: 24 గంటల్లోనే రికార్డ్స్ తిరగరాసిన గుంటూరు కారం ట్రైలర్..

 

ఈ సినిమాలో మహేష్ బాబు ఫుల్ లెన్త్ మాస్ పాత్ర  చేస్తున్నారు.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దీనిలో హీరోయిన్లుగా శ్రీలీల, మీనాక్షి చౌదరిలు నటించారు. మహేష్ బాబు తల్లి పాత్రగా రమ్యకృష్ణ నటించింది. అయితే ఈ సినిమా ట్రైలర్ జనవరి7న  గ్రాండ్ గా రిలీజ్ అయింది.ఇది నెట్ లో ఆల్ టైం రికార్డ్లను సృష్టిస్తుంది. ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే భారీ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఈ విషయాన్ని గుంటూరు కారం మూవీ టీం జనవరి 8న అధికారంగా వెల్లడించింది. ఈ సినిమా ట్రైలర్ కు 24 గంటల్లో యూట్యూబ్లో 39 మిలియన్ల (3.9 కోట్లు)కు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో 24 గంటల వ్యవధిలో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న సౌత్ ఇండియన్ మూవీ ట్రైలర్‌గా గుంటూరు కారం ఆల్‍టైమ్ రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని హారిక, హాసినీ క్రియేషన్స్ వెల్లడిస్తూ ఈ రికార్డుకు సంబంధించిన పోస్టర్ కూడా పోస్ట్ చేసింది. ట్రైలర్ లో మహేష్ బాబు డైలాగ్స్ కి  ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. చాలా రోజుల తరువాత మహేష్ నుంచి వస్తున్న మూవీ కావడంతో అభిమానులు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు.

 

Leave a Comment