ap rains: రేపు సోమవారం భారీ వర్షాలు పడే అవకాశం

Written by Rudra

Published on:

ఈ యేడాది కరువు, ఇటీవల వరదలతో బాగా నష్టపోయిన రైతులకు మరో ఆపద ముంచుకొని వస్తుంది.. ఇప్పుడిప్పుడే పండిన పంటలు చేతికొచ్చే సమయంలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.. ఈ వార్త రైతులను కలవరపెడుతుంది. వివరాల్లోకి వెళితే..

రేపు సోమవారం భారీ వర్షాలు పడే అవకాశం

ఈ యేడాది కరువు, ఇటీవల వరదలతో బాగా నష్టపోయిన రైతులకు మరో ఆపద ముంచుకొని వస్తుంది.. ఇప్పుడిప్పుడే పండిన పంటలు చేతికొచ్చే సమయంలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.. ఈ వార్త రైతులను కలవరపెడుతుంది.
రేపు అనగా సోమవారం నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, వైయస్సార్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.. రైతులు ముందస్తు జాగ్రత్తలు చేసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది.దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు..
అయితే ఈ సంవత్సరం వర్షాలు సరిగ్గా లేక ఓ పక్క కరువుతో ప్రజలు అల్లాడుతుంటే, ఇటీవల వచ్చిన మీచౌంగ్ తుఫాను కారణంగా భారీగా పంట నష్టం జరిగింది.. రైతులకు కన్నీరు మిగిల్చింది.. ఇవన్నీ తట్టుకొని చేతికి వస్తున్న పంటలకు ప్రస్తుతం వర్షాలు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది అయితే రైతులు ముందస్తు జాగ్రత్తలు చేసుకోవాలని వాతావరణ శాఖ రైతులకు విజ్ఞప్తి చేస్తుంది.. ప్రభుత్వం అధికారులను  కూడా అప్రమత్తం చేసింది..

apnewshub.com

Leave a Comment