2023వ సంవత్సరంలో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి రావడంతో దాదాపు అన్ని కంపెనీలు 5జీ నెట్వర్క్ ఫోన్ లను మంచి ఫీచర్లతో తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ సంవత్సరం చాలా 5 జీ ఫోన్లు లాంచ్ అయ్యాయి. బడ్జెట్ సెగ్మెంట్లో రియల్ మీ, రెడ్మీ, మోటో, శాంసంగ్ కంపెనీలు మంచి ఫోన్లనే తీసుకొచ్చాయి.. బడ్జెట్ సెగ్మెంట్ లోని ఫోన్ల మధ్య మంచి పోటీనే ఉంది.. మిడ్ రేంజ్లో అనగా 20- నుంచి 40వేల మధ్య సెగ్మెంట్లో దాదాపు అన్ని కంపెనీలు మంచి ఫీచర్లతో చాలా స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేశాయి. ఇక ప్రీమియం (40 వేల పైన) సెగ్మెంట్లో ఆపిల్, వన్ ప్లస్, సామ్సంగ్ లో మంచి ఫోన్ లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి.. ఈ సంవత్సరం ఫోన్లు కెమెరా మరియు బ్యాటరీ పనితీరుతో ఎక్కువ మంది కస్టమర్ల ఆదరణను చూరగొన్నాయి. 2023 వ సంవత్సరంలో ప్రజాధరణ పొందిన కొన్ని మొబైల్ ఫోన్లను ఇక్కడ చూద్దాం…
2023లో వచ్చిన బెస్ట్ ఫోన్స్ ..
వన్ ప్లస్ నార్డ్3 – 5G:
గతంలో ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ లకే పరిమితమైన వన్ ప్లస్ ఇప్పుడు మిడ్ రేంజ్ స్టేట్మెంట్లో మంచి ఫోన్ లను తీసుకొచ్చింది. మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో వన్ ప్లస్ రిలీజ్ చేసిన నార్డ్ సిరీస్ ప్రజాదరణ చూరగొన్నది. ఈ కంపెనీ నుంచి 30 వేల లోపు వచ్చిన మొట్టమొదట ఫోన్ వన్ ప్లస్ నార్డ్ 3 5జీ.. దీనిలో 50 మెగాపిక్సల్ కెమెరా, ఆక్సిజన్ ఓఎస్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటివి చాలామందిని ఆకట్టుకున్నాయి.
POCO F- 5జీ :
షియోమి సబ్ బ్రాండ్ అయిన పోకో మంచి ఫీచర్లతో ఈ ఫోన్ తీసుకొని వచ్చింది. దీనిలో స్నాప్ డ్రాగన్ 7+ జనరేషన్ 2 ప్రాసెస్ ను వాడారు. లిక్విడ్ కూల్ టెక్నాలజీ, యాడ్ ఫ్రీ MIUI ఇంటర్ఫేస్ ఈ ఫోన్లో ఉన్న ప్రధానమైన ఆకర్షణ.. ఫెర్ఫార్మెన్స్ విషయంలో ఈ ఫోన్ మంచి రివ్యూలనే సొంతం చేసుకుంది..
మోటో Edge 40:
మోటోరొలా నుంచి వచ్చిన మెరుగైన ఫోన్లలో ఎడ్జ్ 40 ఒకటి. దీంట్లో పీఓల్‌ఈడీ డిస్‌ప్లే ఇచ్చారు. 1200 నిట్స్, 3డీ కర్వ్‌డ్ డిజైన్, 144 Hz రిఫ్రెష్ రేటు, 92.7 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో వంటి ఫీచర్లు ఈ సెగ్మెంట్‌లో హైలైట్. ఇదే సిరీస్‌లో వచ్చిన ఎడ్జ్ 40 నియో సైతం మెరుగైన ఫీచర్లతో వచ్చింది.
శాంసంగ్ F 54:
శాంసంగ్ ప్రియులను ఈ ఏడాది చాలా ఫోన్లు పలకరించాయి. అందులో తక్కువ ధరలో మెరుగైన సదుపాయాలతో వచ్చిన ఫోన్ శాంసంగ్ ఎఫ్ 54. బ్యాటరీ లైఫ్‌ను అధికంగా కోరుకునే వారి కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఫొటోల కోసం 108 ఎంపీ కెమెరా ఉంది. దాదాపు ఇదే ఫీచర్లతో ఎం సిరీస్‌లో తీసుకొచ్చిన శాంసంగ్ ఎం 54 సైతం యూజర్లను ఆకట్టుకుంది.
రెడ్‌మీ నోట్ 12ప్రో+5జీ:
రెడ్‌మీ నోట్ సిరీస్‌లో ఈ ఏడాదిలో వచ్చిన బెస్ట్ ఫోన్ అంటే రెడ్‌మీ నోట్ 12ప్రో. 200 ఎంపీ కెమెరా, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వచ్చింది.. మంచి కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్, మంచి డిస్ ప్లే గల ఈ ఫోన్ చాలా మందిని ఆకట్టుకుంది. రూ.20 వేల్లోపు 108 ఎంపీ కెమెరాతో వచ్చిన రెడ్‌మీ నోట్ 12 ప్రో కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది.
రియల్‌మీ 11 ప్రో:
దీనిలో రెండు వెర్షన్‌లు ఉన్నాయి. రియల్‌మీ 11 ప్రో (Realme 11 Pro), రియల్‌మీ 11 ప్రో+ (Realme 11 Pro+) ఫోన్లు.. ఇవి ఆండ్రాయిడ్ 13 రియల్‌మీ ui 4.0 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తాయి.. . రెండింటిలోనూ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (1,080×2,412 pixels) కర్వ్‌డ్ స్క్రీన్ ఇచ్చారు. 6ఎన్‌ఎం ఆక్టాకోర్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్, 11 ప్రో ఫోన్‌లో 100 మెగాపిక్సెల్ కెమెరాను, Realme 11 Pro+ లో 200 మెగాపిక్సెల్ కెమెరానుఇచ్చారు… వీటిలో వరుసగా 16 మెగాపిక్సెల్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఈ రెండూ వెర్షన్లలో 5000mAh బ్యాటరీని ఉంటుంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.. ఈ ఫోన్లు కూడా మంచి సేల్స్ ను నమోదు చేసుకున్నాయి..
IQOO Neo 7:
వివో సబ్‌బ్రాండ్ IQOO. ఈ ఏడాది నియో 7 పేరుతో తీసుకొచ్చిన స్మార్ట్‌ఫోన్ గేమర్లను బాగా ఆకట్టుకుంది. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్ కలదు. 6.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 64 ఎంపీ OIS కెమెరాతో వచ్చినది. రూ.30వేల బడ్జెట్‌లో గేమర్స్ బెస్ట్ ఛాయిస్‌గా నిలిచింది. అలాగే, కర్వ్‌డ్ డిస్‌ప్లేతో వచ్చిన ఐకూ జడ్7 ప్రో సైతం ఆకట్టుకుంది.
వన్‌ప్లస్ 11ఆర్ 5జీ:
వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి వచ్చిన మెరుగైన ఫోన్లలో వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ఒకటి. కర్వ్‌డ్ డిస్‌ప్లేతో స్నాప్‌డ్రాగన్ 8+1 జనరేషన్‌తో వచ్చిన ఈ ఫోన్ యూజర్లను ఆకట్టుకుంది. 50ఎంపీ కెమెరానే అయినా మెరుగైన ఫొటోలు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ.
లావా అగ్ని 2:
దేశీయ మొబైల్ తయారీ కంపెనీ లావా ఈ ఏడాది తీసుకొచ్చిన ‘అగ్ని 2’ 5జీ ఫోన్.. ఇది మంచి రివ్యూలను సొంతం చేసుకుంది. రూ.20 వేలకే 6.78 అమోలెడ్ కర్వ్‌డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, 66W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వచ్చిన ఈ ఫోన్.. పండగ సేల్స్‌లో ప్రధాన కంపెనీల ఫోన్లకు గట్టి పోటీనిచ్చింది.
నథింగ్ 2:
నథింగ్ 1తో మొబైల్ మార్కెట్లో తనదైన గుర్తింపును సొంతం చేసుకున్న నథింగ్ కంపెనీ నుంచి వచ్చిన రెండో ఫోన్ నథింగ్ 2. 50+50 ఎంపీ కెమెరాలు, స్నాప్‌డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్.. రొటీన్‌కు భిన్నంగా ఫోన్ కొనాలనుకునే వారికి ఒక ఆప్షన్‌గా మారింది. ప్రీమియం ఫీల్ ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ.
హానర్ 90:
చాలా ఏళ్ల తర్వాత హానర్ కంపెనీ హానర్- 90తో భారత మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 1 ప్రాసెసర్, రెండేళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ హామీతో వచ్చింది. ఇందులోని 200 ఎంపీ కెమెరా, 50 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 1.5కె స్క్రీన్ కలవు . మంచి ఫీచర్లతో వచ్చినా ధర రూ.30వేలు పైనే.
ఇక ప్రీమియం సెగ్మెంట్‌లో యాపిల్ సిరీస్‌లో వచ్చిన
- ఐఫోన్ 15, ఐ ఫోన్ 15ప్రో మ్యాక్స్,
- వన్‌ప్లస్ లో తొలి మడత ఫోన్ ఓపెన్, , వన్‌ప్లస్ 11 5జీ,
- గూగుల్ పిక్సెల్ 8ప్రో,
- ఒప్పో ఎన్ 3 ఫ్లిప్,
- శాంసంగ్ జడ్ ఫోల్డ్ 5, ఫ్లిప్ 5, శాంసంగ్ ఎస్23 అల్ట్రా, ఎస్23 లు యూజర్లను ఆకట్టుకున్నాయి.
నోట్: ఇది ఫోన్ లకు ర్యాంకింగ్ కాదు.. మొబైలు కొనేవాళ్ళు ఆయా మొబైలు కంపెనీల వెబ్ సైట్ లలో వాటి రేట్లు, ఫీచర్లను పరిశీలించగలరు..