ఆరోగ్యవంతమైన సంతానం కోసం ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. ఈ సమయంలో మహిళలు ఆరోగ్యం విషయంలో, ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మహిళల శరీరంలో హార్మోన్లలో మార్పులు జరుగుతుంటాయి. చాలామంది మహిళలు ఎక్కువ బిపి, ఐరన్ లోపం, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడుతుంటారు. చెడు ఆహారపు అలవాట్లు వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంటుంది. దీన్ని సకాలంలో నియంత్రించకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఒకోసారి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రెగ్నెన్సీ సమయంలో మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా…
ప్రెగ్నెన్సీలో బాడ్ కొలస్ట్రాల్ ఉంటే ఏ లక్షణాలు కనిపిస్తాయి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలకు ఉండే అతి ముఖ్య సమస్య వాంతులు. ఈ సమస్య ఎక్కువ రోజులు ఉంటే చెడు కొలెస్ట్రాల్ వల్ల కూడా కావచ్చు అని అర్థం చేసుకోవాలి. వెంటనే మహిళలు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకుని చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకునే మార్గాలు అనుసరించాలి.
- ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఎక్కువ శారీరకంగా శ్రమ చేయరు. కానీ వాళ్ళు విశ్రాంతి తీసుకునేటప్పుడు అలసిపోయినట్లు ఉంటే అది అధిక కొలెస్ట్రాల్ లక్షణం అని అర్థం చేసుకోవాలి. లేకపోతే ఏదైనా విటమిన్ సమస్య వల్ల కూడా ఇలా జరగవచ్చు.
- మహిళలలో ప్రెగ్నెన్సీ సమయంలో రక్తపోటు పెరిగితే హార్టుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో బిపి ఎక్కువగా ఉండటం అనేది చెడు కొలెస్ట్రాల్ వల్ల కూడా జరగవచ్చు.
- ప్రెగ్నెన్సీ సమయంలో హైబీపీ ఉన్న మహిళలు తరచుగా టెస్టులు చేయించుకోవాలి.
- ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలకు ఛాతి నొప్పి ఉంటే అది గ్యాస్ వల్ల కావచ్చు లేదా చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంలో వెంటనే డాక్టర్ను సంప్రదించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.
తీసుకోవలసిన జాగ్రత్తలు:
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వైద్యులను సంప్రదించి ఎలాంటి డైట్ తీసుకోవాలి!! ఎలాంటి ఆరోగ్య పరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకోవడం అవసరం.. ముఖ్యంగా మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఆహ్లాదకరమైన వాతావరణంలో అనగా మంచి గాలి, వెలుతురు ఉన్న గదిలో ఉండాలి. మంచి సంగీతం వినడం, మంచి ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం వంటివి చేయడంవల్ల ఆరోగ్యవంతమైన సంతానం కలుగుతుంది.