ఇండియాలో జనవరి 25 నుంచి భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఐదు టెస్ట్ మ్యాచ్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోతుంది.
IND vs ENG: ఇంగ్లండ్ జట్టు ప్రకటన..
భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్.. కెప్టెన్ ఎవరంటే?
ఇండియాలో జనవరి 25 నుంచి భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఐదు టెస్ట్ మ్యాచ్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోతుంది.ఐదు టెస్ట్ మ్యాచ్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోతుంది. విశాఖపట్నంలోని వైయస్సార్ స్టేడియం లో రెండో టెస్ట్ మ్యాచ్, రాజ్‌కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మూడవ టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. అయితే భారత్ తో జరగబోయే ఈ టెస్ట్ సిరీస్ కు ఇంగ్లాండు తమ జట్టును ప్రకటించింది. స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టాక్స్ నాయకత్వంలోని 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. వన్డే ప్రపంచ కప్ లో గాయం కారణంగా మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు బెన్ స్టోక్స్.. మళ్లీ ఇప్పుడు ఫిట్నెస్ సాధించి టీంకు నాయకత్వం వహించబోతున్నాడు.. జనవరి 25 నుంచి భారత్ ఇంగ్లాండ్ ప్రారంభమయ్యే ఈ సిరీస్ కు తాము సన్నద్ధంగా ఉన్నామని బెంజ్ స్టాక్స్ ప్రకటించాడు.. అయితే ఐదు మ్యాచ్‌లు నాల్గవ టెస్ట్ మ్యాచ్ రాంచీలోని JSCA స్టేడియంలో జరగనుండగా, ధర్మశాలలోని HPCA స్టేడియం చివరి టెస్ట్ మ్యాచ్ జరగనుంది…
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు:
బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేమ్స్ ఎమర్సన్, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఒల్లీ పోప్, ఆలీ రాబిన్సన్. జో రూట్, మార్క్ వుడ్.షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్,
భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్:
జనవరి 25 నుండి 29 వరకు – మొదటి టెస్ట్ (హైదరాబాద్)
ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు – రెండో టెస్టు (విశాఖపట్నం)
ఫిబ్రవరి 15 నుండి 19 వరకు – మూడో టెస్టు (రాజ్‌కోట్)
ఫిబ్రవరి 23 నుండి 27 వరకు – నాల్గవ టెస్ట్ (రాంచీ)
మార్చి 7 నుండి 11 వరకు – ఐదవ టెస్ట్ (ధర్మశాల)