ప్రస్తుతం చాలామందిలో యూరిక్ యాసిడ్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. పురుషులు స్త్రీలు ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. యూరిక్ యాసిడ్ అనేది ఒక వ్యర్థ పదార్థం. ఇది మన శరీరంలో పెరగడం వల్ల మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది.
health: యూరిక్ యాసిడ్ కంట్రోల్ కావాలంటే ఏ జ్యూసులు తాగాలి …
ప్రస్తుతం చాలామందిలో యూరిక్ యాసిడ్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. పురుషులు స్త్రీలు ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. యూరిక్ యాసిడ్ అనేది ఒక వ్యర్థ పదార్థం. ఇది మన శరీరంలో పెరగడం వల్ల మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది.అనగా కిడ్నీలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు అది కీళ్లలో కణజాలాల్లో నిక్షిప్తమై దానివల్ల ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్య వల్ల హైబీపీ, కీళ్ల నొప్పులు, నడవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల యూరినల్ పాసింగ్ సమస్య కూడా రావచ్చు.
సుకన్య సమృద్ధి యోజన ఖాతా గురించి 20 సందేహాలు – సమాధానాలు
యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల గోట్ అనే వ్యాధి కూడా వస్తుంది. యూరిక్ యాసిడ్ సమస్య తగ్గాలంటే కొన్ని జ్యూసులు వల్ల మెరుగెల ఫలితాలు వస్తాయి.
అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం….
* నారంజ్ పండ జ్యూస్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మన శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్య నుండి బయట పడవచ్చు.
నిమ్మకాయ – పుదీనా జ్యూస్ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుతుంది.
* నిమ్మకాయ తేనె పుదీనా కలిపి ప్రతి రోజు తీసుకుంటే యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుతుంది.
బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ సమస్య నుండి బయట పడవచ్చు. మన రక్తంలో యాంటీ ఆక్సిడెంట్లు పెరుగుతాయి.
* బత్తాయి జ్యూస్ ని కూడా యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గిస్తుంది.
* బీట్రూట్ జ్యూస్ ప్రతిరోజు ఉదయాన్నే తీసుకుంటే యూరిక్ యాసిడ్ సమస్య నుండి బయట పడవచ్చు.
* వాటర్ మిలన్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుతుంది. మరియు ఎముకల నొప్పులు మోకాళ్ళ కీళ్ల నొప్పుల నుంచి బయటపడవచ్చు.
* నిమ్మకాయ రసం తీసుకున్న సి విటమిన్ మోతాదు పెరిగి యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గుతాయి.
* వీటితోపాటు ప్రతిరోజు నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి ఇలా నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో చెడు పదార్థాలు బయటికి వెళ్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇంకా ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండటం, స్ట్రాబెరీ, బ్లూబెర్రీస్ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ సమస్య నుంచి బయట పడవచ్చు.
* ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.