ap లో టీచర్ల ప్రమోషన్లు , బదిలీల రోడ్ మ్యాప్ విడుదల చేసిన ప్రభుత్వం
ap news: ap లో టీచర్ల ప్రమోషన్లు , బదిలీల రోడ్ మ్యాప్ విడుదల చేసిన ప్రభుత్వం
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను పాఠశాల విద్య అధికారులు శనివారం విడుదల చేశారు.
వచ్చే నెల 20, జనవరి 25, ఫిబ్రవరి 10 తేదీలలో మూడు దశలలో టీచర్ల ప్రొఫైల్ అప్ డేషన్ ఉంటుందన్నారు.
ఫిబ్రవరి 15, మార్చి 1, మార్చి 15 మూడు విడతలుగా సీనియారిటీ జాబితాను ప్రదర్శించనున్నారు.
ఏప్రిల్ 10 నుంచి 15వరకు హెచ్ ఎమ్ ల బదిలీలు, ఏప్రిల్ 21 నుంచి 25 వరకు ఎస్ఏ, మే 1 నుంచి 10 వరకు ఎస్జీటీల బదిలీలు చేపట్టనున్నారు.
అలాగే ఏప్రిల్ 16 నుంచి 20 వరకు హెచ్ఎంల పదోన్నతులు, మే 26 నుంచి 30 వరకు ఎస్ఏల పదోన్నతులు చేపట్టనున్నారు.
మే 11 నుంచి 30 డీఎస్సీ సీట్ల భర్తీ చేపట్టనున్నారు.