Guntur karam: గుంటూరు కారం మరో రికార్డ్.. యూట్యూబ్ ని మడత పెట్టేసింది

Written by Rudra

Published on:

గుంటూరు కారం అంటేనే గుర్తుకొచ్చే సాంగ్ “కుర్చీ మడతపెట్టి”. ఈ పాట ఎంతగా ట్రెండ్ అయిందంటే సౌత్ లో ఈ పాట విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది.

Guntur karam: గుంటూరు కారం మరో రికార్డ్.. యూట్యూబ్ ని మడత పెట్టేసింది

2024 సంక్రాంతికి త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన గుంటూరు కారం భారీ అంచనాల మధ్య విడుదలై మిశ్రమ స్పందన దక్కించుకుంది. అయితే ఈ సినిమాలో పాటలు మాత్రం సంగీత ప్రియుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. ఇందులో సెన్సేషనల్ సాంగ్ “కుర్చీ మడతపెట్టి” సంగీత ప్రియుల్ని అమితంగా ఆకట్టుకుంది. ఈ పాట ఎంతగా ట్రెండ్ అయింది. అంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ఈ పాటకు అందరిని అందరి నోళ్ళలో నానిపోయింది. అయితే ఈ పాట సౌత్ లో ఇప్పటికే చాలా రికార్డులను సొంతం చేసుకుంది.

లిరికల్ సాంగ్ తో పాటు వీడియో సాంగ్ కూడా యూట్యూబ్లో వ్యూయర్షిప్లో టాప్ లో ఉంది. ఈ పాట మరో మైండ్ మైండ్ బ్లాస్టింగ్ రికార్డును సెట్ చేసింది. లేటెస్ట్ గా ఈ ఫుల్ వీడియో సాంగ్ ఏకంగా 500 మిలియన్ వ్యూస్ ను అందుకొని మహేష్ బాబు ఖాతాలో ఆఫ్ బిలియన్ వ్యూస్ ఉన్న సాంగ్ రికార్డును సొంతం చేసుకుంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఈ సినిమాలో పాటలు మాత్రం ఈ రేంజ్ లో దుమ్ము లేపాయి. ఈ విషయాన్ని చెబుతూ ఆదిత్య మ్యూజిక్ ఆడియో సంస్థ ట్వీట్ చేసింది. శ్రీ లీల మహేష్ బాబు కాంబినేషన్లో కొన్ని సీన్స్ అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు సంబంధించి షార్ట్ వీడియోలు విపరీతంగా యూట్యూబ్ లో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ సినిమా కోసం మహేష్ బాబు డిఫరెంట్ లుక్ తో ఉన్న ఫోటోలను షూట్ చేశారు. వచ్చే సంక్రాంతి తర్వాత ఈ సినిమా సెట్స్ కులుస్తుందని తెలుస్తుంది.

Leave a Comment