Movie: దేవరకు భారీగా లాభాలు.. పార్టీ ఇచ్చిన నిర్మాత.. లాభాలు ఎన్ని కోట్లు అంటే!!

Written by Rudra

Published on:

నందమూరి తారక రామారావు – కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ దేవర బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రం విజయంతో ఎన్టీఆర్ అభిమానులు డిస్ట్రిబ్యూటర్లు పండగ చేసుకుంటున్నారు. దేవర విజయంతో భారీ కలెక్షన్లు రావడంతో డిస్ట్రిబ్యూటర్లందరూ గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారు.

Movie: దేవరకు భారీగా లాభాలు.. పార్టీ ఇచ్చిన నిర్మాత.. లాభాలు ఎన్ని కోట్లు అంటే!! 

నందమూరి తారక రామారావు – కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ దేవర బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రం విజయంతో ఎన్టీఆర్ అభిమానులు డిస్ట్రిబ్యూటర్లు పండగ చేసుకుంటున్నారు. దేవర విజయంతో భారీ కలెక్షన్లు రావడంతో డిస్ట్రిబ్యూటర్లందరూ గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారు.నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించిన దేవర మూవీ సెప్టెంబర్ నెల 27వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయింది. మూడు సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో అభిమానుల్లో సినీ ప్రియులలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 509 కోట్లు పైగా వసూలు రాబడినట్లు మేకర్స్ తెలిపారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించారు.

ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ దేవర విజయం వల్ల థియేటర్ ఓనర్స్ నుంచి క్యాంటీన్ల నిర్వహించేవారు వరకు అందరూ లావపడ్డారని తెలిపారు. ఈ చిత్రాన్ని పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్ తో పాటు తాను కూడా సంతోషంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. దేవర సినిమాను పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లతో కలిసి నాగ వంశీ ఒక పార్టీ చేసుకున్నారు ఈ మేరకు వాళ్ళందరూ దుబాయ్ వెళ్లి అక్కడ పార్టీ చేసుకోవడం జరిగిందని ఒక ఫోటోను విడుదల చేయడం జరిగింది. వరల్డ్ వైడ్ గా దేవర మూడు వారాల్లో 509 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలిపారు..
దసరా పండగకు భారీ సినిమాలు విడుదలైనా అవి దేవర కలెక్షన్ల విషయంలో కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. ఇప్పుడు కూడా 50% ఆక్యుపెన్సిల్తో థియేటర్లలో దేవర సినిమా విజయవంతంగా రన్ అవుతుంది. 183 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగిన దేవర ప్రస్తుతం మంచి కలెక్షన్లతో లాభాలు బాటలో దూసుకెళ్లిపోతుంది. ఈ మూవీ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేస్తుందో త్వరలోనే వివరాలు పంపిస్తామని వీరు తెలిపారు.

apnewshub.com 

Leave a Comment