Ap news: ఏపీలో మధ్యాహ్న భోజనంలో మార్పులు..

Written by Rudra

Published on:

ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో చాలా మార్పులు తీసుకొని వస్తుంది. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి విద్యాశాఖలో చాలా రివ్యూ చేస్తూ చాలావరకు గత ప్రభుత్వ విధానాల్లో మార్పులు తీసుకొని వస్తున్నారు.

Ap news: ఏపీలో మధ్యాహ్న భోజనంలో మార్పులు..

ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో చాలా మార్పులు తీసుకొని వస్తుంది. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి విద్యాశాఖలో చాలా రివ్యూ చేస్తూ చాలావరకు గత ప్రభుత్వ విధానాల్లో మార్పులు తీసుకొని వస్తున్నారు.

దానిలో భాగంగా పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకం యొక్క పేరును కూడా మార్పు చేశారు. గతంలో జగనన్న గోరుముద్ద అని ఉన్న ఈ పథకం పేరును PM POSHAN అని పేరు పెట్టారు.

అయితే గత ప్రభుత్వం హయాంలో మధ్యాహ్న భోజన పథకంలో ఎన్నడు లేని విధంగా మార్పులు తెచ్చారు. దాంట్లో ఉన్న కొన్ని లోపాలను సవరిస్తూ ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకంలో కొన్ని మార్పులు చేస్తున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.. అంతకు ప్రభుత్వంలో “జగనన్న గోరుముద్ద” పేరుతో మధ్యాహ్న భోజనం మెనూ మార్చారు. వాటిల్లో వివిధ ప్రాంతాల్లో ఆ మెనూలో ఉన్న ఐటమ్స్ ను తినడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిని మార్చటానికి ప్రస్తుతం ప్రభుత్వం రివ్యూ చేసి కొన్ని మార్పులను తీసుకొని వస్తుంది.

  • ఇంకా మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచుతూ మెనూలో దీపావళి నుంచి మార్పులు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
  • రెగ్యులర్ ఫుడ్ తో పాటువారంలో 5 రోజులు ఇస్తున్న గుడ్డును 3 రోజుల పాటు వేపుడు, కూర రూపంలో ఇవ్వనున్నారు.
  • రాగి జావతో పాటు వారంలో కొన్ని రోజులు కేక్, డ్రైఫ్రూట్స్ లడ్డూను అందిస్తారు.
  • ఓ రోజు అరటి పండు కూడా మెనూ లో చేరుస్తారు.
  • అయితే ఏ ప్రభుత్వాలు వచ్చినా బియ్యం మాత్రం మార్చడం లేదు. సన్నబియ్యాన్ని అందిస్తే చాలామంది విద్యార్థులు చక్కగా భోజనం చేసే అవకాశం ఉంటుంది.

Leave a Comment