సంచలనాలు దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏది చేసిన వివాదాలు,సంచలనాలు రేకత్తిస్తూ ఉంటాయి. ఇటీవల ఆయన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన వ్యూహం సినిమా అనేక సంచలనాలకు కేంద్ర బిందువు అయింది. ఈ సినిమాపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు కుమారుడు లోకేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి సినిమా విడుదలను అడ్డుకోవడం జరిగింది.
Movie: “వ్యూహం – శపథం” సినిమాల కొత్త రిలీజ్ డేట్లు అనౌన్స్ చేసిన రాం గోపాల్ వర్మ
ఇటీవల వ్యూహం సినిమాకి సంబంధించిన సెన్సార్ ఇబ్బందులు అన్ని తొలగిపోయి సినిమాను విడుదల చేసుకోవచ్చని గౌరవ కోర్టు తెలియజేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన మూవీ రిలీజ్ డేట్ ను రాంగోపాల్ వర్మ ఈరోజు ప్రకటించారు. నవంబర్ 10 సినిమాలు 25వ తేదీన ముందుగా ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేశారు
ముందుగా వ్యూహం సినిమాను ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ మారుస్తున్నట్లు ఒక పోస్టర్ను రిలీజ్ చేశారు వర్మ. వ్యూహం సినిమాను ఫిబ్రవరి 23వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. తర్వాత మార్చి ఒకటో తేదీన “శపధం” సినిమా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన అంశాలను ఆధారంగా చేసుకుని వ్యూహం సినిమాను తీయడం జరిగింది. ఈ సినిమా నవంబర్ నెలలో రిలీజ్ కావలసి ఉండగా సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు అప్పట్లో సెన్సార్ బోర్డ్ నిరాకరించింది. వ్యూహం సినిమాతో పాటు దాని రెండో భాగం అయిన “శపధం” పేరుతో ఇంకో సినిమాను వర్మ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. అసలు నవంబర్ 10న వ్యూహం,జనవరి 25 వ తేదీన శపధం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేశారు..। అయితే ప్రస్తుతం ఫిబ్రవరి 23 తేదీన వ్యూహం మార్చి ఒకటో తేదీనశపధం విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి.. మరి ఈ సినిమాలు ఎలాంటి వివాదాలు రేకెత్తిస్తాయో తెలియాల్సి ఉంది..