Movie news: మొత్తానికి “వ్యూహం” సినిమా విడుదల తేదీని ప్రకటించిన రాంగోపాల్ వర్మ

Written by Rudra

Published on:

రాంగోపాల్ వర్మ సంచలనాత్మక మూవీ వ్యూహం. ఈ వ్యూహం సినిమా.. ఎన్నో రాజకీయ మలుపులతో ఎన్నో రకాల ఇబ్బందులతో ముందుకు సాగుతూ చిట్టచివరకు విడుదలకు సిద్ధమైంది..

Movie news: మొత్తానికి “వ్యూహం” సినిమా విడుదల తేదీని ప్రకటించిన రాంగోపాల్ వర్మ

సంచలనాత్మక దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందించబడిన వ్యూహం సినిమా ఎన్నో మలుపులు తిరుగుతూ చివరకు విడుదలకు సిద్ధమైంది. రాంగోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కించిన వ్యూహం సినిమా ఎట్టకేలకు మార్చి 2వ తేదీన థియేటర్స్ లో విడుదల అవుతుంది అని సెన్సార్ సర్టిఫికెట్ పట్టుకుని దిగిన ఫోటోతో కొంతసేపు క్రితమే రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు..

వ్యూహం సినిమా గత సంవత్సరంలోనే విడుదల కావాల్సి ఉండగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి అయిన నారా లోకేష్ ఈ సినిమా విడుదల మీద హైదరాబాద్ కోర్టులో కేసు వేసి అడ్డుకున్నారు. ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే విషయంపై చాలాకాలం స్తబ్దత నెలకొని ఉండగా చివరకు హైదరాబాద్ రీజనల్ ఆఫీసు నుంచే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధమైంది. అయితే సినిమా ఫిబ్రవరి 23వ తేదీన విడుదలవలసి ఉండగా కొన్ని కారణాల రీత్యా మార్చి మూడవ తేదీకి  మారింది..  మరల మార్చి రెండవ తేదీన విడుదల చేస్తున్నట్టు రాంగోపాల్ వర్మ తెలిపారు.

అయితే ఈ సినిమా విడుదలను నారా లోకేష్ అడ్డుకొనగా ఎన్నికల ముందు అనుకున్నట్లుగానే వ్యూహం సినిమా తప్ప రిలీజ్ చేస్తానని రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా  ప్రకటించారు..  మొత్తానికి రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన అనుకున్నది సాధించారని చెప్పవచ్చు.  ఎంతోమంది ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా చూద్దామని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. రాజకీయ నేపథ్యంలో ఇన్ని సంచలనాలకు స్థానం అయిన వ్యూహం సినిమాకు మంచి ప్రచారం లభించింది.. మొత్తానికి ఈ సినిమా మార్చి రెండో తేదీన థియేటర్లోకి వస్తుంది..

Leave a Comment