కర్వ్ డిస్ ప్లే ఫోన్లు ఈమధ్య బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి.. 30 వేల ధరలోపు కర్వ్ డిస్ ప్లే ఫోన్ ఇప్పుడు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఇండియాకు చెందిన స్మార్ట్ ఫోన్ సంస్థ లావా మార్కెట్లోకి తక్కువ బడ్జెట్ లోనే కర్వ్ డిస్ ప్లే తో ఒక ఫోన్ ను తీసుకొని వస్తుంది.. లావా బ్లేజ్ కర్వ్ 5G పేరుతో ఒక ఫోను త్వరలో మార్కెట్లోకి లాంచ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి..
Lava Blaze Curve: తక్కువ బడ్జెట్‌లో కర్వ్ డిస్‌ప్లే మొబైలు కోసం చూస్తున్నారా.? అయితే ఇదే బెస్ట్ ఆప్షన్..
మార్కెట్లోకి రోజుకొక కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అవుతూ సందడి చేస్తుంది.. వినియోగదారులను ఆకట్టుకునే ఉద్దేశంతో కొత్త కొత్త టెక్నాలజీతో ఫోన్లను మార్కెట్లోకి కంపెనీలు విడుదల చేస్తున్నాయి. కర్వ్ డిస్ ప్లేకు ఎక్కువ స్పేస్ ఇస్తూ స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్ లోకి తీసుకొని వస్తున్నారు.. ఇటీవల కర్వ్ డిస్ ప్లే స్మార్ట్ ఫోన్స్ కు యూజర్ నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. అయితే ఇలాంటి డిస్ప్లేతో వచ్చే స్మార్ట్ ఫోన్లు దాదాపు ఎక్కువగా ప్రీమియం సెగ్మెంట్ కి చెందినవే ఉంటున్నాయి.. కనీసం 30 వేల కంటే తక్కువ ధరలలో కర్వ్ డిస్ ప్లే ఫోన్లు అందుబాటులో లేవు. అయితే భారతదేశానికి చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ లావా మార్కెట్లోకి 30వేల కంటే తక్కువ ధరలోనే కర్వ్ డిస్ ప్లే ఫోనును తీసుకొని వస్తుంది. లావా బ్లేజ్ కర్వ్ 5G పేరుతో ఒక స్మార్ట్ ఫోన్ను త్వరలోనే మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. ఇటీవల లావా రిలీజ్ చేసిన ఫోన్లు వినియోగదారుల యొక్క ఆదరణను పొందాయి. దీనికి సంబంధించి కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ నెట్లో దీనికి సంబంధించినటువంటి ఫీచర్లు వైరల్ అవుతున్నాయి..
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మీడియా టెక్ డైమన్సిటీ 7050 ప్రాసెసర్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు తెలుస్తుంది.. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 128gb స్టోరేజ్ మరియు 8 జిబి రామ్ 256 జిబి స్టోరేజ్ లలో తీసుకువస్తున్నట్లు తెలుస్తుంది.. దీని ధర 16,000 నుంచి 19000 మంది ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.. మార్చి నెల మొదటి వారంలో ఈ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.. ఈ ఫోను సూపర్ ఆమోలెడ్ డిస్ప్లేతో 120hz రీఫ్రెష్ రేట్ తో వస్తున్నట్లు తెలుస్తుంది .. దీనిలో 64 మెగాపిక్సల్ రేర్ కెమెరా మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ఉన్నట్లు తెలుస్తుంది.. మరి ఈ ఫోన్ కి వినియోగదారుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో త్వరలో చూడాలి..