movie:’యాత్ర-2′ మూవీ రివ్యూ

Written by Rudra

Published on:

‘యాత్ర-2’ మూవీ రివ్యూ

నటీనటులు: జీవా-మమ్ముట్టి-మహేష్ మంజ్రేకర్-శుభలేఖ సుధాకర్ – కేతకి నారాయణ్-సుజానె బెుర్నెట్–అశ్రిత వేముగంటి-సచిన్ ఖేద్కర్ తదితరులు మొదలగువారు.
సంగీతం: సంతోష్ నారాయణన్
రచన-దర్శకత్వం: మహి.వి.రాఘవ్
నిర్మాత: శివ మేక
ఆంధ్రప్రదేశ్ లో 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చిన డా .వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’ మంచి విజయం సాధించింది. ఆ చిత్రానికి దర్శకుడు మహి.వి.రాఘవ్.. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర-2’ను సిద్ధం చేశాడు. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘యాత్ర-2’ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:
2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు వైఎస్ తనయుడైన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కోరుకుంటారు. కానీ హై కమాండ్ మాత్రం అతణ్ని కాదని రోశయ్యను ముఖ్యమంత్రిని చేస్తుంది. మరోవైపు జగన్ తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలిన వారిని ఓదార్చేందుకు ఓదార్పు యాత్ర చేస్తుంటే కాంగ్రెస్ హై కమాండ్ అడ్డుకుంటుంది. దీంతో పార్టీతో పాటు పదవులకూ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తాడు జగన్. మరి ఈ ఎన్నికల్లో జగన్ ఎలా విజయం సాధించాడు.. అధికార పార్టీని వదిలిపెట్టాక అతడికి ఎదురైన సమస్యలేంటి.. వాటిని ఎదుర్కొని నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు.. వంటి విశేషాల సమాహారమే యాత్ర-2 సినిమా..

పొలిటికల్ బయోపిక్ లో ఒక ట్రెండ్ సృష్టించిన సినిమా యాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే రాజకీయ నాయకుల జీవిత చరిత్రలు అంటే ఆ నాయకుడికి సంబంధించిన ఎలివేషన్లు ప్రత్యర్థులను కించపరిచే విధంగా ఉండే సీన్లు ఎక్కువగా ఉంటాయి కానీ యాత్ర సినిమాలో ఆ డోర్స్ తగ్గించి వైయస్ రాజశేఖర్ రెడ్డి లోని మానవయ్య కోలాన్ని మాత్రమే ఎలివేట్ చేస్తూ దర్శకుడు మంచి ఫలితాన్ని అందుకున్నాడు.. అందులో కూడా కొన్ని అతిశయోక్తులు.. కల్పనలు ఉన్నట్లు అనిపించినా.. వైఎస్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను హృద్యంగా తెరపై చూపించిన తీరు మాత్రం ఆకట్టుకుంది.
వైయస్ మీద అభిమానం లేని వారిలో కూడా కొంత మార్పు తీసుకువచ్చిన సినిమా యాత్ర.
అయితే ప్రస్తుత యాత్ర టూలో వైఎస్ తనయుడు తనయుడు జగన్మోహన్ రెడ్డి మీద జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనల ఆధారంగా యాత్ర 2 సినిమా దర్శకుడు తీశారు.
జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోయిన తర్వాత జరిగిన ఎదుర్కొన్న కొన్ని సంఘటనలను ఎంతో హృద్యంగా చిత్రీకరించాడు దర్శకుడు.. అయితే శత్రువుల మీద ఎక్కువగా బురదల్లే ప్రయత్నం చేయకపోవడం అభినందించదగిన విషయం…
అయితే
‘యాత్ర-2’ జగన్ బయోపిక్.. జగన్మోహన్ రెడ్డి అభిమానులకు ఈ సినిమా గూస్ బంప్స్ ఇస్తుంది. వైఎస్ అభిమానులను మరోసారి తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తుంది. అయితే ఈ సినిమా.. ప్రతిపక్షం వాళ్లకు అంతగా రుచించదు. ‘యాత్ర’ వైఎస్ రాజకీయ జీవితంలో అత్యత కీలకంగా నిలిచిన పాదయాత్ర చుట్టూ నడిచే ఒక ఎమోషనల్ జర్నీ కాగా.. ‘యాత్ర-2’ వైఎస్ మరణానంతరం ఎదురైన సవాళ్లను ఛేదించి జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు జరిగే సంఘటనలను చూపించే సినిమా. ‘యాత్ర’ స్థాయిలో కాకపోయినా ఇందులోనూ హ్యూమన్ యాంగిల్ అక్కడక్కడా హైలైట్ అయింది. అందుకోసం వైఎస్ పాత్రనే వాడుకున్నారు. ప్రధానంగా జగన్ కు హీరోయిక్ ఎలివేషన్ ఇవ్వడానికే ఇందులో ప్రయత్నం జరిగింది. ఒక వ్యక్తికి సంకల్ప బలం ఉంటే ఎలాంటి సవాళ్లనైనా ఛేదించి విజయం సాధించగలడని జగన్ పాత్ర ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు మహి.వి.రాఘవ్.

అయితే ఈ సినిమాలో జగన్మోహన్ రెడ్డిని హీరోగా.. ప్రతిపక్ష పార్టీలను సినిమా, బాబు పాత్రలను విలన్ లుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే కొద్దిగా జరిగిందని చెప్పాలి. అయితే ప్రతిపక్ష పాత్రలను వ్యంగంగా చిత్రీకరించిపోవడం అభినందించదగ్గ విషయం..
యాత్ర -2 సినిమా వైఎస్ మరణంతో మొదలుపెడితే.. జగన్ విభజిత ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యే వరకు జరిగిన ముఖ్యమైన ఉదంతాలన్నీ అందరికీ తెలుసు. అవన్నీ మీడియాలో చూసిన విషయాలే. ఆ ప్రధాన ఘట్టాల నడుమ జరిగిన తెరవెనుక విషయాలు ఏంటి.. జగన్ ఏ సమయంలో ఎలా రియాక్టయ్యాడు.. తన మొండి పట్టుదలతో సవాళ్లకు ఎలా ఎదురు నిలిచాడు.. ఈ విషయాలన్నింటినీ తెర మీద మహి.వి.రాఘవ్ ఆసక్తికరంగా ప్రెజెంట్ చేశాడు. జగన్ ఎంతటి మొండివాడో కొన్ని సన్నివేశాలతో బలంగా చూపించాడు మహి. జగన్ కు ఇప్పటికీ బలంగా నిలుస్తున్నది వైఎస్ కొడుకు అన్న ముద్రే కాబట్టి.. ఆ పాత్రను యాత్ర-2లోనూ చాలా బాగా వాడుకున్నాడు దర్శకుడు. ఆరోగ్యశ్రీ పెట్టడానికి దారి తీసిన కారణం చూపిస్తూ ఒక హృద్యమైన ఎపిసోడ్ తో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. ఈ సీన్ వైయస్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఆ తర్వాత కూడా సమయానుకూలంగా వైఎస్ పాత్రను చక్కగా వాడుకున్నాడు. వైఎస్ మరణానికి సంబంధించిన ఎపిసోడ్ ఆయన అభిమానులను కదిలిస్తుంది.
ఆ తర్వాత ఫోకస్ జగన్ పాత్ర మీదికి మళ్లుతుంది. జగన్ని ముఖ్యమంత్రిని చేయడానికి ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టడం.. అది పార్టీ హై కమాండుకి రుచించకపోవడం.. రోశయ్యను ముఖ్యమంత్రిని చేయడం.. జగన్ ఓదార్పు యాత్రకు శ్రీకారం చుడితే.. దానికి పార్టీ అడ్డు చెప్పడం.. ఆయన ఆ పార్టీని వదిలి సొంతంగా పార్టీ పెట్టి ఉప ఎన్నికలకు వెళ్లి గెలవడం.. ఆపై కేసులు.. జైలు జీవితం.. బెయిలు.. 2014 ఎన్నికలు.. అందులో ఓటమి తర్వాత జరిగిన పాదయాత్ర.. 2019 ఎన్నికల్లో ఘనవిజయం వరకు తెలిసిన విషయాలనే పకడ్బందీగా తెరపైన చూపించాడు మహి. తనకు సవాళ్లు ఎదురైనపుడు జగన్ ఎలా మొండిగా నిలబడ్డాడో చూపించే సన్నివేశాాలు ఆ పాత్రకు మంచి ఎలివేషన్ ఇచ్చాయి. అవి జగన్ అభిమానులను ఉర్రూతలూగిస్తాయి. ముఖ్యంగా కడపోడి నైజం.. జగన్ మొండితనం గురించి చెప్పే సన్నివేశాల్లో ఎలివేషన్ బాగా పండింది. ఐతే ముగింపు సన్నివేశాల్లో వైఎస్ మరణం తర్వాత కూడా సాధించిన విజయం గురించి.. జగన్ సంకల్పం గురించి చెప్పిన మాటలు బాగున్నాయి.


జగన్ విషయంలో ఎవరి ఆలోచన ఎలా అయినా ఉండొచ్చు. ఐతే మనిషి సంకల్పం అన్నింటికంటే గొప్పది అని ఆ పాత్ర ద్వారా చెప్పడం బాగుంది. పొలిటికల్ బయోపిక్స్ అన్నాక వన్ సైడెడ్ అనిపించడం సహజం. ‘యాత్ర-2’ కూడా అందుకు భిన్నమేమీ కాదు. కానీ జగన్ కథను నీట్ గా.. బలంగా చెప్పడంలో మహి విజయవంతం అయ్యాడు. ఇంకా ఈ సినిమాలో నందిగం సురేష్ సంబంధించిన సీన్లు బాగా ఆకట్టుకున్నాయి..
నటీనటులు:
ముఖ్యపాత్ర జగన్ పాత్రను తమిళనటుడు జీవా ఎంతో అద్భుతంగా పోషించారు.. లుక్స్ విషయంలోనూ హావభావాల విషయంలో చాలా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఇక వైయస్ పాత్రలో మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మిగతాపాత్రలు చక్కగా సూట్ అయ్యాయి..
జగన్ వ్యక్తిత్వాన్ని ఆ పాత్రలో ప్రతిబింబించేలా చేయడంలో జీవా కృషి బాగుంది. శుభలేఖ సుధాకర్ జగన్ పాత్రకు ఎలివేషన్ ఇచ్చే క్యారెక్టర్లో ఆకట్టుకున్నారు.

రైటర్ కమ్ డైరెక్టర్ మహి.వి.రాఘవ్.. తాను చెప్పాలనుకున్న కథను నీట్ గా తెరపై ప్రెజెంట్ చేశాడు.
పొలిటికల్ బయోపిక్ ను చక్కగా తీయడంలో తన టాలెంట్ను మరొకసారి ప్రదర్శించాడు దర్శకుడు.
జగన్ కథను బలంగా చెప్పడానికి అతను ఎంచుకున్న సన్నివేశాలు.. రాసుకున్న డైలాగులు చాలా బాగున్నాయి.
చివరగా: యాత్ర-2.. వైయస్ అభిమానుల సినిమా
రేటింగ్ – 3.0/5

Leave a Comment