Movie: ఎక్కువ భాషల్లో రీమేక్ అయిన తెలుగు సినిమా ఏమిటో తెలుసా!!

Written by Rudra

Published on:

మంచి కథ, కథనం ఉంటే సినిమా సూపర్ హిట్ అవుతుంది. సినిమాకు ప్రాణం కథే.. మంచి కథ ఉన్న సినిమాకు భాష ,ప్రాంతీయతత్వం ఉండదు. ఎక్కడైనా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. సినిమా ఒక భాషలో హిట్ అయితే దానిని మిగతా భాషల్లోకి రీమేక్ చేయడం సహజంగా జరిగే ఎటువంటి విషయమే.

Movie: ఎక్కువ భాషల్లో రీమేక్ అయిన తెలుగు సినిమా ఏమిటో తెలుసా!!

మంచి కథ, కథనం ఉంటే సినిమా సూపర్ హిట్ అవుతుంది. సినిమాకు ప్రాణం కథే.. మంచి కథ ఉన్న సినిమాకు భాష ,ప్రాంతీయతత్వం ఉండదు. ఎక్కడైనా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. సినిమా ఒక భాషలో హిట్ అయితే దానిని మిగతా భాషల్లోకి రీమేక్ చేయడం సహజంగా జరిగేటువంటి విషయమే. హిట్ అయిన సినిమాను రెండు లేదా మూడు భాషల్లో రీమేక్ చేయడం జరుగుతుంది. కానీ ఒక తెలుగు సినిమా 9 భాషల్లో రీమేక్ అవడం ఖచ్చితంగా రికార్డే.. 2005వ సంవత్సరంలో రిలీజ్ అయిన “నువ్వొస్తానంటే నేనొద్దంటానా” మూవీ సంచలన విజయం సాధించింది. సిద్ధార్థ, త్రిష హీరో హీరోయిన్లుగా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్లో ఎంఎస్ రాజు నిర్మాతగా ప్రభుదేవా దర్శకత్వం వహించిన “నువ్వొస్తానంటే నేనొద్దంటానా” మూవీ సూపర్ హిట్ అయింది.

సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా 2005వ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు నెలకొల్పింది. దీనికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. దీనిలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. పేదింటి అమ్మాయిని ప్రేమించిన, ధనవంతుడైన హీరో… హీరోయిన్ ఇంటికి వచ్చి, హీరోయిన్ అన్నయ్యతో పందెం కాసి ఎన్నో కష్టాలకు ఓర్చి ఆ పందెంలో విజయం ఎలా సాధించాడు అనే కథతో, ఆకట్టుకునే కథనంతో ఈ సినిమాను ఎంతో గ్రిప్పింగ్ గా ప్రభుదేవా తీశారు. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
అయితే ఈ సినిమా ఇప్పటివరకు మొత్తం తొమ్మిది భాషల్లో రీమేక్ అయింది ఏడు భారతీయ భాషల్లో, రెండు విదేశీ భాషల్లో ఈ సినిమా రీమేక్ చేయడం జరిగింది.
ఏ భాషలో ఏ పేరుతో ఈ సినిమా విడుదల అయ్యిందో చూద్దాం..


భారతీయ భాషలు.
1.ఉనక్కం ఎనక్కం (తమిళం)
2. నీనెల్లో నానల్లే (కన్నడ)
3. రామయ్య వస్తావయ్యా (హిందీ)
4. సునా ఛాదీ మో రూపా ఛాదీ (ఒడియా)
5. నింగోల్‌ తజబ(మణిపురి)
6. తేరా మేరా కీ రిష్తా (పంజాబీ)
7. ఐ లవ్‌ యు (బెంగాలీ)
విదేశీ భాషలు:-
8. నిస్సా అమర్‌ తుమీ (బంగ్లాదేశ్‌ బెంగాలీ)
9. ది ఫ్లాష్ బ్లాక్: ఫర్కెరా హెర్దా (నేపాలీ)

Leave a Comment