దుమ్ము రేపుతున్న యాత్ర 2 ట్రైలర్.. సామాజిక మాధ్యమాల్లో పేలుతున్న డైలాగులు

Written by Rudra

Published on:

ఆంధ్రప్రదేశ్ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన బయోపిక్ మూవీ యాత్ర.. 2019లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటించారు అనడం కంటే పాత్రలో జీవించారు అని చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా రెండో భాగం యాత్ర 2 పేరుతో విడుదలకు సిద్ధమవుతోంది..

దుమ్ము రేపుతున్న యాత్ర 2 ట్రైలర్.. సామాజిక మాధ్యమాల్లో పేలుతున్న డైలాగులు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర సినిమా అప్పట్లో ప్రేక్షకుల నీరాజనాలను అందుకుంది.. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళం నటుడు మమ్ముట్టి ఎంతో బాగా నటించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా వచ్చిన యాత్ర సినిమాకు కొనసాగింపుగా వస్తున్న “యాత్ర 2”  విడుదలకు సిద్ధం అయింది.. మహి రాఘవ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి కనిపిస్తుండగా, వైఎస్ జగన్ పాత్రలో తమిళ్ హీరో జీవా నటిస్తున్నారు.. ఈ సినిమాను  ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం నాడు టీజర్ ను విడుదల చేశారు..

ఈ టీజర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో ఉంటుందని అర్థమవుతుంది.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో ముమ్ముట్టి..  జగన్ పాత్రలో జీవ బాగా నటించినట్లు తెలుస్తుంది.. ఈ టీజర్ లో ఇంకా వైఎస్ భారతి, చంద్రబాబు నాయుడు, కొడాలి నాని వంటి పాత్రలు కనిపిస్తున్నాయి.. దీనిలో ఉన్న కొన్ని డైలాగ్స్ వైఎస్ఆర్ పార్టీ అభిమానులను మరియు సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.. ఇందులో చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కనిపిస్తున్నారు.. ఫిబ్రవరి 8న ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు ఈ సినిమా నిర్మాతలు తెలిపారు .

అయితే  వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, అభిమానులు  యాత్ర 2 ట్రైలర్ లో ఉన్న డైలాగ్స్ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా పోస్ట్ చేస్తున్నారు.. ఈ ట్రైలర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రతో చెప్పించిన డైలాగ్స్ వారిని బాగా ఆకట్టుకున్నాయి.. అయితే ఇటీవల వ్యూహం సినిమా ప్రభావం ఈ సినిమాపై ఎంతవరకు ఉంటుందనేటువంటిది తెలియాల్సి ఉంది. దీనిపై ప్రతిపక్ష పార్టీలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి..

Leave a Comment