kidney disease: ఈ లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే..

Written by Rudra

Published on:

మానవ శరీరంలో కిడ్నీలో ఎంతో ముఖ్యమైన అవయవాలు. కిడ్నీలు రక్తాన్ని వడపోసి రక్తంలోని వ్యర్ధాలను మూత్రరూపంలో బయటకు పంపిస్తాయి.. ఇంకా  ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేసే హార్మోన్లను కిడ్నీలు తయారు చేస్తాయి.  చాలామందిలో కిడ్నీలు పూర్తిగా డ్యామేజ్ అయ్యేవరకు తెలుసుకోలేక ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే మ శరీరంలో కొన్ని లక్షణాలు కనబడతాయి..  మూత్రపిండాలకు సమస్య వచ్చిందని వీటి ద్వారా మనం గుర్తించి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయట పడవచ్చు.

kidney disease: ఈ లక్షణాలు కనిపిస్తే..  మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే..

ప్రస్తుతం చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్నారని తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళన వంటివాటి వలన కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. ఇండియాలో  కిడ్నీ కేసులు బాగా పెరుగుతున్నాయి. ఒక్కోసారి కిడ్నీ కూడా మార్చవలసిన వస్తుంది..

  • కిడ్నీ సమస్య వచ్చే ముందు చిన్న చిన్న పనులకే అలసిపోతారు. ఏ పని పై ఏకాగ్రత చూపలేరు. వారి రక్తంలో విష వ్యర్థాలు చేరతాయి. దాని వల్ల నీరసం వచ్చేస్తుంది. రక్తహీనత సమస్య కూడా వస్తుంది.

  • కిడ్నీ సమస్యలు ఉంటే.. శరీరంలోంచి మనకు అవసరమైన ప్రోటీన్లు మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతాయి. దీంతో ప్రోటీన్ల లోపం తలెత్తి కళ్ల చుట్టూ ఉబ్బుతాయి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే.. నిద్రలేమి సమస్య కూడా ఎదురవుతుంది. కిడ్నీ వైఫల్యం కారణంగా రక్తంలో చేరే వ్యర్థాలు.. బయటకు వెళ్లవు. ఈ ప్రభావం శరీర భాగాలపై పడి నిద్రలేమి సమస్య ఎదురవుతుంది.
  • చర్మం పొడిబారినా, తరచూ దురదలు వస్తున్నా.. అది కూడా కిడ్నీ సమస్య కావచ్చు. కిడ్నీలు రక్తకణాలకు సాయం చేస్తాయి. అలాగే ఎముకల్ని బలంగా ఉంచుతాయి. శరీరంలో ఖనిజాలు సరైన మోతాదులో ఉండేలా చేస్తాయి. ఖనిజాల విషయంలో తేడా వస్తే..దురదలు వస్తాయి.

  •  మూత్రపిండాలు సరిగా ఫిల్టర్ అవ్వకపోతే… నిద్రసరిగా పట్టదు. మూత్రం నుంచి పోవాల్సిన వ్యర్థాలన్నీ రక్తంలోనే ఉండిపోతాయి. బరువు కూడా పెరుగుతారు. మాటిమాటికీ నిద్రలేస్తారు.
  •  కిడ్నీలు సరిగా పనిచేయని వారు తరచూ టాయిలెట్ కు వెళ్తుంటారు. కొంతమంది ఈ సమస్యను యూరిన్ ప్రాబ్లెమ్ అనుకుని వదిలేస్తారు. కిడ్నీ సమస్య ఉన్న వారికీ ఇలా అవుతుందని గ్రహించలేరు. ఈ సమస్య ఉన్న వారు వైద్యుడిని సంప్రదించి.. మందులు వాడటం మంచిది.

  •  యూరిన్‌లో రక్తం కనిపిస్తే.. అది కూడా కిడ్నీల సమస్య అని గ్రహించండి. కిడ్నీలు సరిగా ఫిల్టర్ చెయ్యకపోతే.. రక్తకణాలు లీక్ అవుతాయి. అవి యూరిన్ ద్వారా బయటకు వస్తాయి. ఈ సమస్య ఉన్న వారు వెంటనే వైద్యుని సలహా తీసుకోండి.
  •  ఈ సమస్య ఉన్న వారికీ ఇంతక ముందు కంటే ఆకలి తగ్గుతుంది. సాధారణంగా కొన్ని సందర్భాల్లో ఆకలి లేకపోవడం సహజం. ఇదే సమస్య రోజు రోజుకీ పెరుగుతుంటే.. మీ కిడ్నీలు సరిగా పనిచేయట్లేదని అర్ధం.

నోట్:  గమనిక: పై సమాచారం ఆరోగ్య నిపుణులు మరియు వివిధ అధ్యయనాల ప్రకారమే ఇచ్చినది.  ఇది కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్య సమస్యలకు వైద్యులను సంప్రదించడమే ఉత్తమం.. గమనించగలరు.

Leave a Comment