ఇండియాలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India)లో 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ల (PO) పోస్టుల భర్తీకి నిర్వహించిన మెయిన్స్ పరీక్ష యొక్క ఫలితాలు విడుదలయ్యాయి.
SBI PO Results: SBI పీవో మెయిన్స్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి.. ఫేజ్-3 పరీక్ష ఎప్పుడంటే..
ఈ పరీక్ష ఫలితాలను ఎస్బీఐ ఈ రోజు (గురువారం) విడుదల చేసింది. గత సంవత్సరం నవంబర్ 21వ తేదీన ప్రిలిమ్స్ ఫలితాలను అధికారులు విడుదల చేశారు.. డిసెంబర్ 5, 16 తేదీల్లో మెయిన్స్ పరీక్ష జరిగింది. మెయిన్స్ పరీక్షలో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు సైకోమెట్రిక్ లాంటి ఫేజ్-3 పరీక్షకు సిద్ధం కావాల్సి ఉంటుంది. సైకోమెట్రిక్ పరీక్ష జనవరి 16వ తేదీ నుంచి, గ్రూప్ ఎక్సర్సైజ్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూలు జనవరి 21 నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇలా చెక్ చేసుకోండి..
- ఎస్బీఐ పీఓ మెయిన్స్ ఫలితాల (SBI PO Mains Result 2023) ను ఈ కింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా తెలుసుకోవచ్చు.
- ముందుగా ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in ను ఓపెన్ చేయాలి.
- ఆ తరువాత, కెరీర్స్ లింక్ పై క్లిక్ చేయాలి.
- అనంతరం కరెంట్ ఓపెనింగ్ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఎస్బీఐ పీఓ మెయిన్స్ 2023 రిజల్ట్ లింక్ పై క్లిక్ చేయండి.
- కొత్త పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
- రిజల్ట్ చెక్ చేసుకుని పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
- తదుపరి అవసరాల కోసం ఫలితాల హార్డ్ కాపీని భద్రపర్చుకోండి.
- ఈ మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు సైకోమెట్రిక్ పరీక్షకు హాజరు కావడానికి అర్హులు.