Movies: సంక్రాంతి సినిమాల్లో ఎంత వసూళ్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ వస్తుందంటే..

Written by Rudra

Published on:

ఈ సంక్రాంతికి (2024) ఈసారి పెద్ద సినిమాలు సందడి చేయనున్నాయి.. ఈ పండుగకు‘గుంటూరు కారం’ ‘హనుమాన్’ ‘సైంధవ్’ ‘నా సామి రంగ’ వంటి మోస్ట్ అవైటెడ్ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. ఒకదానికి ఇంకోటి గట్టి పోటీ ఇచ్చేలానే కనిపిస్తున్నాయి. అయితే మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా మీదనే ఎక్కువమంది ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉన్నాయి.. ప్రస్తుతం ఈ సినిమాల్లో ఏ సినిమా ఎక్కువ కలెక్షన్లు సాధిస్తుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Movies: సంక్రాంతి సినిమాల్లో ఎంత వసూళ్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ వస్తుందంటే..

ఈ సంక్రాంతికి (2024) ఈసారి పెద్ద సినిమాలు సందడి చేయనున్నాయి.. ఈ పండుగకు‘గుంటూరు కారం’ ‘హనుమాన్’ ‘సైంధవ్’ ‘నా సామి రంగ’ వంటి మోస్ట్ అవైటెడ్ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. ఒకదానికి ఇంకోటి గట్టి పోటీ ఇచ్చేలానే కనిపిస్తున్నాయి.మొదటి రోజు ఆ సినిమా టాక్ తో సంబంధం లేకుండా మహేష్ బాబు మూవీ  భారీ ఓపెనింగ్స్ ని సాధిస్తుంది అనడంలో సందేహం లేదు…ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్డ్ బుకింగ్స్ భారీగా ఉన్నాయి..

ఆ తర్వాత ‘హనుమాన్’ సినిమా పై జనాల ఫోకస్ ఉంది. ఈ సినిమా కూడా చిన్న పిల్లలని, ఫ్యామిలీ ఆడియన్స్ ని కచ్చితంగా థియేటర్ కి రప్పిస్తుంది అని అంతా నమ్ముతున్నారు. భారతదేశం మొత్తం అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది..ఇక వెంకటేష్ యాక్షన్ మూవీ ‘సైంధవ్’, అక్కినేని నాగార్జున నుంచి చాలా రోజుల తరువాత వస్తున్న ‘నా సామి రంగ’ మూవీలపైన కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి…

అయితే వీటి థియేట్రికల్ బిజినెస్.. మరియు ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తే సేఫ్ అవుతుంది అనే ప్రశ్నలు అందరిలోనూ ఉంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘గుంటూరు కారం’ సినిమా రూ.130కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇది చిన్న టార్గెట్ అయితే కాదు చూడాలి మరి… అయితే జనవరి 12నే అన్ని సినిమాల కంటే ముందే రిలీజ్ అవుతుంది. కాబట్టి మంచి ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంది.. మహేష్ బాబు ఉన్న మాస్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని సులభంగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది.

Also read: దుమ్ము రేపుతున్న యాత్ర 2 ట్రైలర్.. సామాజిక మాధ్యమాల్లో పేలుతున్న డైలాగులు

ఇక ‘హనుమాన్’ సినిమా రూ.25 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయాలి. అయితే ఈ సినిమాకి హిట్ టాక్ రాకపోతే కష్టమే. అలాగే ‘సైంధవ్’ కూడా రూ.25 కోట్లు షేర్ ను రాబట్టాలి. ఇక నాగార్జున ‘నా సామి రంగ’ సినిమా రూ.18 కోట్ల షేర్ ను రాబడితే సేఫ్ అయిపోయినట్టే..! హిట్ టాక్ వస్తే .. ‘నా సామి రంగ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడం ఈజీ అనే చెప్పాలి.
మరి పండుగకి ఏ సినిమా విజయం సాధిస్తుందో చూడాలి..

 

Leave a Comment