తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. అయితే పాఠశాలలకు దసరా, సంక్రాంతి సెలవులు ఎక్కువ రోజులు ఇవ్వడం జరుగుతుంది.. అయితే సంక్రాంతి సంబరాలకు సర్వం సిద్ధమవుతున్న వేళ సెలవులపై ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.. ఏపిలో పాఠశాలలకు ఎల్లుండి నుంచి అనగా 9వతేదీ నుంచి 10 రోజులు సెలవులు ప్రకటించింది. తిరిగి 19వ తేదీన పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్ని పాఠశాలల యాజమాన్యాలకు జిల్లా విద్యా శాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
పాఠశాలలకు సంక్రాంతి సెలవులు …ఏపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు
సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. జనవరి 9 నుంచి 18 వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ జనవరి 14 ఆదివారం భోగి పండుగ, జనవరి 15 సోమవారం సంక్రాంతి పండుగ జరుపుకోనున్నారు. కాగా, 18 వరకు సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ముందుగా పాఠశాలలు, కళాశాల యాజమాన్యాలు 16వ తేదీ వరకే సెలవులు ఉంటాయనుకున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం 18వ తేదీ వరకు పాఠశాలలకు సెలవలు ప్రకటించింది.. తిరిగి పాఠశాల 19వ తేదీన పాఠశాలలు ప్రారంభమవుతాయి.. అయితే పదో తరగతి విద్యార్థులకు మాత్రం కొన్ని రోజులు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారులు షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది.
Also read: రాత్రిపూట భోజనంలో ఈ కూరగాయలు తింటున్నారా… తింటే మీ ఆరోగ్యం దెబ్బ తినవచ్చు!!
తెలంగాణలో కూడా సంక్రాంతి సెలవులను 9 నుంచి 16 వ తేదీ వరకు సెలవులు ప్రకటించడంతో ఉద్యోగాల రీత్యా తెలంగాణలో ఉంటున్న వారు ఇప్పటికే సొంతూర్లకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ప్రభుత్వం ఎన్ని ఆదేశాలు ఇచ్చినా కొన్ని ప్రైవేటు పాఠశాలలు మాత్రం పండగ సెలవుల్లో కూడా తరగతుల నిర్వహించి విద్యార్థులను వత్తిడికి గురి చేస్తున్నారని అలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ అధికారులు హెచ్చరించడం జరిగింది. మొత్తానికి సంక్రాంతి పండుగ సంబరాలు తొమ్మిదో తేదీ నుండి ప్రారంభమవుతాయని చెప్పవచ్చు..