మలయాళ మూవీ “నాయట్టు” కి రీమేగా తెలుగులో వచ్చిన “కోటబొమ్మాలి పీఎస్” సినిమా ఓటిటిలో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. శ్రీకాంత్ కీలక పాత్రలో జిఏ 2 పిక్చర్స్ వారు రూపొందించిన ఈ మూవీ నవంబర్ 24న ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా విమర్శకులు సైతం ఈ సినిమాని మెచ్చుకోవడం జరిగింది. అయితే ఈ సినిమా ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ లో ఈరోజు అనగా జనవరి 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది..
Kotabommali PS in OTT : ఓటీటీలోకి కోటబొమ్మాళి PS మూవీ..
కోటబొమ్మాళి పీఎస్ సినిమా మలయాళ సూపర్ హిట్ చిత్రం “నాయట్టు” కి రీమేక్ గా తెరకెక్కింది. ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. థ్రిల్లర్ సస్పెన్స్నే కాకుండా ఎమోషన్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ , శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ కానిస్టేబుల్స్ గా అధ్బుతంగా నటించారు. నవంబర్ 24న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. కోటబొమ్మాళి పీఎస్ సినిమా మలయాళ సూపర్ హిట్ చిత్రం “నాయట్టు” కి రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాకు తేజ మార్ని దర్శకత్వం వహించారు..
కోటబొమ్మాళి పీస్ సినిమా సూపర్ హిట్ టాక్ తో మంచి వసూళ్లను కూడా రాబట్టింది. థియేటర్స్ లో ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ ఈ రోజు జనవరి 11 న “ఆహా”లో రిలీజ్ అయ్యింది. ఓటీటీలోనూ కోటబొమ్మాళి పీఎస్ కు మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమా ఓటీటీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు కోటబొమ్మాళి పీఎస్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
కోటబొమ్మాళి పీఎస్ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా మంచి రేటుకి పొందింది. ఈ సినిమాకు రంజన్ రాజ్ సంగీతం అందించారు. ఈ సినిమాలోని “లింగిడి లింగిడి” అనే సాంగ్ బాగా పాపులర్ అయ్యింది. థియేటర్లో మంచి వసూల్లు సాధించి చాలా కాలం తరువాత హీరో శ్రీకాంత్ కి మంచి విజయాన్ని అందించింది..