ఇండియన్ మార్కెట్ లోకి మరొక చైనీస్ బ్రాండ్ ఫోన్ మంచి ఫీచర్లతో రాబోతుంది.. vivo sub బ్రాండ్ అయిన iQOO (ఐక్యూ) ఒక కొత్త మోడల్ ఫోన్ మార్కెట్లోకి తీసుకువస్తుంది..
iqoo neo 9 pro: చాలామంచి ఫీచర్లతో వస్తున్న iQOO నియో 9 ప్రో .. లాంచ్ తేదీ ఎప్పుడంటే..
దేశీయ మార్కెట్లోకి మరో చైనీస్ స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. ఈ క్రమంలో iQOO నియో 9 ప్రో వచ్చే నెల ఫిబ్రవరి 22న దేశంలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో కంపెనీ కంపెనీ వివరాలు పోస్ట్ చేసింది. ఈ మొబైల్ 2024 ఫిబ్రవరి 22వ తేదీన లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా తెలిపింది .. ఈ మొబైల్ సేల్స్ అమెజాన్ లో అందుబాటులో ఉంటాయని తెలియపరిచింది. అయితే ఈ మోడల్ గురించి అధికారికంగా స్పెసిఫికేషన్లను ప్రకటించనప్పటికీ లీకైన సమాచారం గురించి ఇప్పుడు చుద్దాం.
- ఐక్యూ నియో9 ప్రో ఫోన్ (iQoo Neo 9 Pro) ఆండ్రాయిడ్ 14-బేస్డ్ ఫన్‌టచ్ ఓఎస్ 14 ( Android 14-based Funtouch OS 14) version పై పని చేస్తుంది.
- iQOO Neo 9 Proలో 6.78 అంగుళాల OLED డిస్‌ప్లే 2800 x 1260 రిజల్యూషన్ కలదు.
- ఇది HDR 10 టెక్నాలజీతో లభించనుంది.
- 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది.
- దీనిలో Qualcomm Snapdragon 8 Gen 2 ప్రొసెసర్, గ్రాఫిక్స్ కోసం Adreno 740 GPU వంటి ఫీచర్లు ఉన్నాయి.
- 16GB LPDDR5X RAM + 1 TB UFS4.0 అంతర్గత నిల్వతో రానుంది.
- ఈ మొబైల్ బ్యాక్ ఫినిషింగ్ వైబ్రేట్ లెదర్ డ్యుయల్ టోన్ రెడ్ అండ్ వైట్ కలర్ తో వస్తుంది..
- డ్యూయల్ రియర్ కెమెరా సపోర్టుతో 50 మెగాపిక్సెల్ సోనీ వీసీఎస్ ఐఎంఎక్స్ 92 సెన్సార్, 50 మెగాపిక్సెల్ సెకండ్ కెమెరాతో రానుంది.
- ఇక సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది.
- ఇక 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో.. 5160mAh బ్యాటరీతో వస్తుంది.
- అయితే దీని ధర విషయానికి వస్తే చైనా మార్కెట్లో ఐక్యూ నియో9 ప్రో ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.35 వేల (2999 చైనా యువాన్లు)కు లభిస్తుంది. మరి ఇండియాలో రూ.40 వేల లోపు అందుబాటులో ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు.
- ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా మాత్రమే ఈ ఫోన్ సేల్స్ జరుగుతాయి..
ఇంకా పూర్తి వివరాలు ఫోన్ లాంచింగ్ తేదీన కంపెనీ తెలియపరుస్తుంది..