ప్రస్తుతం ఎక్కువ మందిని బాధపడుతున్న సమస్య ఒబిసిటీ అనగా అధిక బరువు.. ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వలన ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. ఈ మధ్యకాలంలో చిన్నతనంలోనే హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయి.
Health tip: శరీరంలో కొవ్వు తగ్గి వెయిట్ లాస్ అవ్వాలంటే.. వారానికి రెండు సార్లు ఈ పానీయం తాగండి
ప్రస్తుతం ఎక్కువ మందిని బాధపడుతున్న సమస్య ఒబిసిటీ అనగా అధిక బరువు.. ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వలన ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. ఈ మధ్యకాలంలో చిన్నతనంలోనే హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయి. దీనికి అధిక ఒత్తిడి మరియు ఆహారపు అలవాట్లు కారణం అవుతున్నాయి. చాలామంది రుచి కోసం ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం.. జంక్ ఫుడ్ లు ఎక్కువగా తినడం వలన మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోయి అనారోగ్యం పాలవుతున్నారు. చిన్నప్పటినుండి పిల్లలు స్ట్రీట్ ఫుడ్స్ మరియు ప్యాకింగ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వారికి దీర్ఘకాలంలో హార్ట్ ఎటాక్, క్యాన్సర్ వంటి వ్యాధులు బారినపడుతున్నారు.
చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రస్తుత జీవన విధానంలో ఎవరికి వ్యాయామం చేసే తీరిక కూడా ఉండటం లేదు. అయితే ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతోటే మనం బరువు తగ్గే మార్గం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మన వంట గదిలో దాల్చిన చెక్క, మిరియాలు, పసుపు, పుదీనా ఆకులు, వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పానీయం తయారు చేసుకొని తాగితే బరువు తగ్గుతారు. అది ఎలా తయారు చేయాలంటే కొన్ని మిరియాలు, చిటికెడు పసుపు, కొన్ని పుదీనా ఆకులు, మూడు వెల్లుల్లి రెబ్బలు, ఒక దాల్చిన చెక్క తీసుకొని బాగా దంచి..। పొయ్యి మీద ఒక గ్లాసు నీటిని వేడి చేసి.. దంచిన మిశ్రమాన్ని దాన్లో బాగా మరగనివ్వాలి. తర్వాత ఆ పానీయం గోరువెచ్చగా అయిన తర్వాత వడగట్టి ఒక గ్లాసులోకి తీసుకొని రుచికోసం ఒక స్పూన్ తేనె కలుపుకొని వారానికి రెండు పరగడుపునే తీసుకోవాలి..
ఇలా చేయడం వల్ల మన శరీరంలో మరియు రక్తనాళాల్లో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. మన రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతాయి. దీని వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. మరియు అధిక బరువు తగ్గుతారు. మిరియాలు, దాల్చిన చెక్క యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. వెల్లుల్లి, పసుపు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. అయితే దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.. వారానికి రెండుసార్లు మాత్రమే తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటూ కొంత సమయం అయిన వ్యాయామం చేయడం ఖచ్చితంగా మన దినచర్యలో భాగం చేసుకోవాలి.