రాత్రిపూట భోజనంలో ఈ కూరగాయలు తింటున్నారా… తింటే మీ ఆరోగ్యం దెబ్బ తినవచ్చు!!

Written by Rudra

Published on:

మనం తినే ఆహారం ముఖ్యంగా రాత్రిపూట  ఆహారాన్ని సరైన సమయంలో తీసుకోవాలి..  లేకపోతే ఊబకాయం ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.. రాత్రిపూట  మనం తీసుకునే కొన్ని  ఆహార పదార్థాలు మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. నిద్రపై కూడా ప్రభావం చూపుతాయి. రాత్రిపూట ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల నిద్ర పై దాని ప్రభావం ఉంటుందట… బంగాళదుంపలు కూడా రాత్రిపూట తినకూడదని చెబుతారు..

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా కూరగాయలు పండ్లు తీసుకోవడం చాలా అవసరం..  కూరగాయలలో అనేక పోషకాలు ఉంటాయి. రాత్రిపూట మనం తినకూడని కొన్ని కూరగాయలు ఉన్నాయి.. అవి ఏంటో ఇక్కడ చూద్దాం..

రాత్రిపూట భోజనంలో ఈ కూరగాయలు తింటున్నారా…  తింటే మీ ఆరోగ్యం దెబ్బ తినవచ్చు!!

  •  బ్రోకలీ మన ఆరోగ్యానికి చాలా మంచిది.   దీనిలో ట్రిప్టోఫాన్ అనే సమ్మేళనం ఉంటుంది. మరియు దీనిలో ఫైబర్ కూడా చాలా ఎక్కువ. ఈ కారణంగా  రాత్రిపూట బ్రోకలీ  తీసుకుంటే త్వరగా జీర్ణం కాదు..
  • రాత్రిపూట పడుకోయే ముందు వెల్లుల్లి తినడం అంత మంచిది కాదు.  వెల్లుల్లి జీర్ణం కావడానికి సమయం తీసుకుంటుంది.  వెల్లుల్లి ఆరోగ్యపరంగా మంచిదైనప్పటికీ రాత్రిపూట తీసుకుంటే కడుపులో మంట, గుండెల్లో మంట, అజీర్ణం, గ్యాస్టిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది..
  • టమోటాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అయితే రాత్రిపూట తీసుకుంటే కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. టమోటాలలో  అమినో ఆసిడ్స్ ఉంటాయి.  దీనివల్ల జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి.. దీని తినడం వల్ల రాత్రిపూట సరిగా నిద్ర పట్టదు.
  • తీపి బంగాళాదుంపలు శీతాకాల సూపర్ ఫుడ్లుగా చెబుతారు..  కానీ వీటిని  రాత్రిపూట తినకూడదు. దీంట్లో ఫైబర్, కార్బోహైడ్రెడ్స్  ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణం కావడానికి సమయం పడుతుంది. మరియు గ్యాస్టిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
  •  ఉల్లి ప్రతి ఇంట్లో వాడుతారు కానీ రాత్రిపూట ఉల్లిపాయలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి..  ఉల్లిపాయలు తినడం వల్ల నిద్రపై దాని ప్రభావం ఉంటుంది మరియు రాత్రిపూట ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య వచ్చే అవకాశం కూడా ఉంది..
  • బఠానీలు మంచి పోషక విలువలు కలిగినటువంటి ఆహారం.  వీటిలో ఫక్తోజు, ఫైబర్ అధికంగా ఉంటాయి..   రాత్రిపూట తీసుకోకుండా మామూలుగా తింటే మంచిగానే ఉంటుంది కానీ రాత్రిపూట మాత్రం ఇవి కడుపునొప్పి జీర్ణ వ్యవస్థ మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ap news hub

 

Leave a Comment