Health tips: 60 ఏళ్ల వయసులో 20 లో లాగా కనిపించాలా? అయితే ఇవి చేయండి..

Written by Rudra

Published on:

వయస్సు గడియారం ముళ్లులా తిరుగుతూనే ఉంటుంది.. ఒక్క క్షణం కూడా ఆగదు.. కాలంతో పాటు వయసు పెరుగుతుంది వృద్ధాప్యంలోకి అడుగుపెడతాం. అయితే కొంతమంది 60 ఏళ్ళ వయసులో కూడా 20 ఏళ్ల వయసులోలాగా యవ్వనంగా కనిపిస్తారు. వాళ్లు అలా కనిపించడానికి కారణం ఏమిటి? మనం కూడా ఎక్కువ వయసులో ఆరోగ్యంగా ఫీట్ గా ఉండాలంటే ఏం చేయాలి? మనం కొన్ని మంచి ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించాలి.. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Health tips: 60 ఏళ్ల వయసులో 20 లో లాగా కనిపించాలా? అయితే ఇవి చేయండి..

60 ఏళ్ల వయసులో కూడా కొందరు యవ్వనంగా కనిపిస్తూ ఉంటారు.. మరి అలా కనిపించడానికి కారణం ఏంటి? వాళ్ళలా మనం కూడా ఆరోగ్యంగా ఫీట్ గా ఉండాలంటే ఏం చేయాలి? మీరు కూడా ఆరోగ్యంగా ఫిట్ గా ఎక్కువ రోజులు జీవించాలని కోరుకుంటే మనం  కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించాల్సిందే..

  • మన ఆరోగ్యంగా యంగ్ గా ఉండాలంటే సహజమైన ఆహారం తప్పకుండా మన రోజువారి ఆహారంలో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.. సహజమైన ఆహారం అంటే ఆకుకూరలు, చిక్కుళ్ళు, క్యాలీఫ్లవర్, పచ్చిబఠానీలు, క్యాప్సికం, బచ్చలకూర, తోటకూర మొదలగునవి.. వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మాన్ని ఎప్పుడూ యవ్వనంగా ఉంచుతాయి.

  • ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే తాజా పండ్లు, కూరగాయలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ప్రాసెస్ చేసినటువంటి ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్స్ తీసుకోవడం తగ్గించాలి. విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ప్రతినిత్యం తీసుకోవాలి.. దీనివల్ల చర్మం యవ్వనంగా ఉంటుంది. బ్లాక్ బెర్రీస్,చేప, చిక్కుళ్ళు, తృణధాన్యాలు వంటివి మనల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి.. గుండె జబ్బుల నుంచి క్యాన్సర్ నుంచి మధువేహం నుండి కాపాడతాయి.

Also read: రాత్రిపూట భోజనంలో ఈ కూరగాయలు తింటున్నారా… తింటే మీ ఆరోగ్యం దెబ్బ తినవచ్చు!!

  • మొలకెత్తిన విత్తనాలు, గింజలు తినడం వల్ల ఒమేగా 3 ఫ్యాట్, ఆరోగ్యకరమైన ఫ్యాట్ ఎక్కువగా మనకు లభిస్తుంది. ఇవి యవ్వనంగా ఉండటానికి ఉపయోగపడతాయి. గుమ్మడి గింజలు, బాదంపప్పు, జీడిపప్పు, వాల్ నట్స్, పిస్తా మొదలైనవి మనం ప్రతినిత్యం ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం…

  • మంచి ఆహారంతో పాటు ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం శరీరం ఎంత చురుగ్గా ఉంటే అంత ఎక్కువ ప్రయోజనం. క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం, ధ్యానం చేయడం, యోగా చేయడము, వాకిం,గ్ సైక్లింగ్, స్విమ్మింగ్, జిమ్ వంటి వ్యాయామాలు వల్ల ఆరోగ్యంగా ఉంటాం. శరీరంలోని ఒత్తిడి బయటకు వెళ్తుంది. రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

  • స్నేహితులు, బంధువులు, సన్నిహితులతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నం చేయాలి. తద్వారా ఒత్తిడి తగ్గి మనస్సు  ప్రశాంతంగా ఉంటుంది. ఒంటరితనం దగ్గరికి రాదు. దీనివలన గుండె జబ్బులు, స్ట్రోక్స్ వంటి ప్రమాదాల నుంచి బయటపడతాం..

 

Leave a Comment