Health tips: రాత్రిపూట బాగా నిద్ర పట్టడం లేదా..! ఈ ఫుడ్స్ తినకండి..

Written by Rudra

Published on:

రాత్రిపూట చాలామందికి నిద్ర పట్టక నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం కొన్ని ఆహార పదార్థాలను తినడమే.. దీనివల్ల నిద్ర సరిగ్గా పట్టదు.. అవేమిటో ఇప్పుడు చూద్దాం..

Health tips: రాత్రిపూట బాగా నిద్ర పట్టడం లేదా..! ఈ ఫుడ్స్ తినకండి..

రాత్రిపూట కొన్ని రకాల ఆహార పదార్ధాలు తింటే నిద్ర పట్టదు. వీటిని అసలు తినొద్దని.. వీలైతే తొందరగా తినడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. సాయంత్రం 8 గంటల లోపే డిన్నర్ ముగించేస్తే అది అరగడానికి తగిన సమయం ఉంటుంది. రాత్రిపూట తేలిక జీర్ణం అయ్యేటువంటి ఆహారం తీసుకోవడం మంచిది. అందుకు మనం కొన్ని రకాల ఆహార పదార్థాలను మాత్రమే తినాలి.

  • రాత్రిపూట మనం తినే ఫుడ్ మన నిద్ర మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కనుక మనం నిద్రకు ఒక గంట ముందయినా భోజనం చేయాలి.
  • రాత్రి భోజనం చేయకుండా ఎప్పుడూ నిద్రపోకూడదు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఎంత ఇంపార్టెంటో సాయంత్రం డిన్నర్ కూడా అంతే ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోవాలి. బరువు తగ్గాలనుకునేవారు తక్కువగా తినడం మంచిది. రాత్రి  8:00 లోపు చేస్తే ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చు.

  • డీప్ ఫ్రై వంటకాలు అసలు తినకూడదు. వీటివల్ల యాసిడ్ రిఫ్లెక్షన్ అయి గ్యాస్ సమస్య రావచ్చు. అప్పుడు నిద్ర సరిగ్గా పట్టదు.
  • రాత్రిపూట వీలైనంతవరకు ఫ్యాట్ ఫుడ్స్ తినకపోవడం ఉత్తమం. అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. నిద్ర సరిగా పట్టదు.
  • అలాగే రాత్రిపూట స్వీట్లు, చాక్లెట్లు వంటివి తినకూడదు. పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారంకి దూరంగా ఉండాలి. దీనివల్ల ఇన్సులిన్ పెరిగి నిద్ర సరిగా పట్టదు.
  • రాత్రిపూట బిర్యాని, ఫ్రైడ్ రైస్, న్యూడిల్స్ లాంటి స్పైసీ ఫుడ్స్ లో తినడం వల్ల గ్యాస్టిక్ సమస్య వస్తుంది. ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి తినడం వల్ల నిద్ర పట్టకపోవచ్చు.

ఇలాంటి ఫుడ్ తినడం వల్ల ఇంకా

  • బాడీ వెయిట్, బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగి, బాడీ మెటబాలిజం దెబ్బతింటుంది.
  • రాత్రి ఆలస్యంగా ఎక్కువ ఫుడ్ తింటే గొంతు పైకి పుల్లని త్రేన్పులు వస్తాయి. దంత సమస్యలు కూడా ఉంటాయి.
  • లేట్ నైట్ తింటే నిద్ర సరిగా పట్టదు. స్లీప్ క్వాలిటీ, డ్యూరేషన్ కూడా తగ్గుతాయి.
  • తినగానే పడుకోవడం, ఆలస్యంగా తినడం వల్ల ఒబేసిటీ, గుండె సమస్యలు, డయాబెటిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి.

Leave a Comment