movie: గుంటూరు కారం ట్రైలర్ అదిరింది.. ఇక సంక్రాంతికి రచ్చ.. రచ్చే

Written by Rudra

Published on:

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో  శ్రీ లీల హీరోయిన్ గా వస్తున్న చిత్రం గుంటూరు కారం.. దీనిని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్య వివర నాగవంశీలు నిర్మిస్తున్నారు. గతంలో త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన “అతడు, ఖలేజా” సినిమాల తర్వాత వచ్చిన మూడో సినిమా గుంటూరు కారం.  ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి..

movie: గుంటూరు కారం ట్రైలర్ అదిరింది.. ఇక సంక్రాంతికి రచ్చ.. రచ్చే

ప్రపంచవ్యాప్తంగా మన మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా “గుంటూరు కారం”.. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయింది.. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.. వీరి కాంబినేషన్లో గతంలో వచ్చిన “అతడు, ఖలేజా” సినిమాలు థియేటర్లో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.. కానీ టీవీలో మాత్రం ఇప్పటికీ “అతడు” సినిమా వస్తే టిఆర్పి రేటింగ్ భారీగా ఉంటుంది.. ఇక ఇప్పుడు అదే కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా గుంటూరు కారం.. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

 

ఇక ట్రైలర్ విషయానికి వస్తే… “మీరు మీ పెద్ద అబ్బాయిని అనాథలాగా వదిలేశారు అని అంటున్నారు” అనే  త్రివిక్రమ్ వాయిస్ ఓవర్ తో  ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఇక మహేశ్ బాబు తల్లిగా రమ్యకృష్ణ నటించింది. మహేష్ ఊర మాస్ లుక్, థమన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. త్రివిక్రమ్ డైలాగ్స్, ఆ కుర్చీని మడతబెట్టి సాంగ్ అదిరిపోయాయి. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టడానికి మహేష్ రెడీ అయినట్లు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, పాటలు,టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఫ్యాన్స్ మహేష్ బాబును ఎలాంటి మాస్ ఎలివేషన్స్ లో చూడాలనుకుంటున్నారో త్రివిక్రమ్ దీంట్లో మహేష్ ను ఎలా చూపించారు.. ఈ సినిమా ట్రైలర్లో యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషన్స్ సీన్స్ కూడా ఉన్నాయి. మహేష్ బాబు లుక్స్ డైలాగ్స్ వేరే లెవల్లో ఉన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా శ్రీలీల, మీనాక్షి చౌదరిలు నటించారు.. జనవరి 12న గుంటూరు కారం సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈసారి గుంటూరు కారం సినిమా భారీ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు..

Leave a Comment