Smartphones: అమెజాన్‌లో జనవరి 13 నుంచి గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ కొనసాగుతోంది. ఈ సేల్స్ లో వివిధ కంపెనీలకు చెందిన మొబైల్స్, టీవీలు, వివిధ గాడ్జెట్ లపై భారీ డిస్కౌంట్ సేల్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం మొబైల్స్ కొనాలనుకునే వాళ్ళకి మంచి సదవకాశంగా చెప్పవచ్చు.
గ్రేట్ రిపబ్లిక్ డే సేల్స్ లో భారీ డిస్కౌంట్‌తో టాప్ స్మార్ట్ఫోన్లు.. ఇలాంటి ఆఫర్లు మళ్లీ రావు!
అమెజాన్‌లో ప్రస్తుతం గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్లు, బ్యూటీ ఐటమ్స్, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, హోమ్ కిచెన్, క్లాత్ వంటి వాటిపై చాలా మంచి డీల్స్ అందుబాటులో ఉన్నాయి.. స్మార్ట్ ఫోన్ లను కొనాలనుకునే వారికి చాలా మంచి డిస్కౌంట్స్ తో మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం.
రెడ్మీ నోట్ 13 5G
రెడ్మీ నోట్ 13 5G అమెజాన్‌లో రూ.17,999కి ఇటీవలే లిస్ట్ అయింది. అయితే సేల్‌లో రూ.16,999కి కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ 1080×2400 రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. MediaTek డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఫోన్ రియర్ కెమెరా సెటప్‌లో, 108MP ప్రైమరీ కెమెరా, 8MP సెకండరీ కెమెరా, 2MP ట్రిపుల్ కెమెరా, సెల్ఫీల కోసం 13MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 6GB RAM, 128GB స్టోరేజ్ అందిస్తుంది. 5000mAh బ్యాటరీ ఉంటుంది.
ఐకూ Z7s 5G స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.23,999. అయితే ఈ సేల్ ఈ మొబైల్ పై 38 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంటే కేవలం రూ.14,999కే ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 6.3-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది, OIS ఫీచర్‌తో 64-మెగాపిక్సెల్ రియర్ షూటర్, స్నాప్‌డ్రాగన్ 695 5G ప్రాసెసర్‌తో పని చేస్తుంది.
పోకో C51, టెక్నో పాప్ 8
మీరు బడ్జెట్లో రూ.10,000 కంటే తక్కువలో ఫోన్ కొనాలనుకుంటే పోకో C51, టెక్నో పాప్ Pop 8 ఫోన్స్ బెస్ట్ ఆప్షన్లు. ప్రస్తుతం రెండు స్మార్ట్ఫోన్లు భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. పోకో C51పై రూ.5,999 భారీ డిస్కౌంట్, టెక్నో పాప్ 8పై రూ. 5,849 డిస్కౌంట్ అందుకోవచ్చు.
యాపిల్ ఐఫోన్ 13
ఐఫోన్ 13(iPhone 13) యాక్చువల్ ప్రైస్ రూ.59,900. అయితే సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ని రూ.48,999కి కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా ఉపయోగించవచ్చు, అదనపు డిస్కౌంట్లు పొందవచ్చు. ఐఫోన్ 13 సూపర్ రెటీనా డిస్ప్లేను కలిగి ఉంది, 12+12 మెగాపిక్సెల్‌ల డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తుంది.
హానర్ 90 5G
అమెజాన్‌లో హానర్ 90 5జీ ఫోన్ ఏకంగా 40 శాతం డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. వినియోగదారులు రూ.28,999కి సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే కంపెనీ ఎస్బీఐ కార్డ్‌పై అందిస్తున్న రూ.2,250 డిస్కౌంట్‌ను పొందవచ్చు.
శామ్సంగ్ గెలాక్సీ S23 5G
శామ్సంగ్ గెలాక్సీ S23 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.89,999. అయితే ప్రస్తుతం రిపబ్లిక్ డే సేల్‌లో లభిస్తున్న అన్ని డిస్కౌంట్లు, ఆఫర్లతో రూ.54,999కే కొనుగోలు చేయవచ్చు. ఫోన్ 256GB స్టోరేజ్, 8GB RAMతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.