CM Jagan: 29 మంది అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ రెడీ చేసిన సీఎం జగన్… వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ టెన్షన్

Written by Rudra

Published on:

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంది.. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార పార్టీ అయిన వైసీపీ తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీగా ఉంది.. రెండోసారి అధికారాన్ని దక్కించుకునే వ్యూహాలతో.. దూకుడు నిర్ణయాలతో ముందుకు వెళుతుంది.. దీనిలో భాగంగా వైయస్సార్సీపి అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు..


CM Jagan: 29 మంది అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ రెడీ చేసిన సీఎం జగన్… వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ టెన్షన్

ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధికార పార్టీ రెండోసారి అధికారాన్ని దక్కించుకునే వ్యూహాలతో వేగవంతమైన నిర్ణయాలతో ముందుకు వెళుతున్నారు. దీనిలో భాగంగా వైసిపి అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. తను సర్వే చేయించుకుని రిపోర్టులు తెప్పించుకొని నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలను నియమిస్తున్నారు. మొదటి లిస్టులో 11 మందిని, సెకండ్ లిస్టులో 27 మందిని మార్చారు. మూడవ లిస్ట్ కూడా రెడీ అయినట్లు తెలుస్తుంది. ఈ మధ్య వరుసగా సమీక్షలు చేసిన సీఎం జగన్ 29 మందితో ఫైనల్ రెస్ట్ రెడీ చేసినట్టు తెలుస్తుంది.

ఇప్పటివరకు 14 మందిపై క్లారిటీ వచ్చిందని ఈరోజు సాయంత్రానికి లేదా రాత్రికి తుది జాబితా సిద్ధం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు మొత్తం 39 మంది ఇన్చార్జిలను మార్చారు. తర్వాత లిస్టులో 29 మంది లిస్టు బయటకు వస్తుంది. మొత్తం 67 మందిని మారుస్తున్నట్లు సమాచారం. 175 సిగ్మెంట్లలో 67 మందిని మార్పు చేస్తూన్నట్లు తెలుస్తుంది. సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి పిలుపు రాగా వైసీపీ ఎమ్మెల్యేలు సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూలు కట్టారు.. ఎవరు సీటు ఉంటుందో.. ఎవరిది ఊడుతుందోనని వైసీపీ అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ వారితో చర్చలు జరిపిన అనంతరమే మూడో జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి రెండోసారి అధికారాన్ని చేయించుకోవాలని సీఎం జగన్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.. అయితే ప్రతిపక్షాలు కూడా సీఎం జగన్ ఎత్తులను జాగ్రత్తగా గమనిస్తున్నారు. అసంతృప్త ఎమ్మెల్యేలు టిడిపి వైపు క్యూ కడుతున్నారు..

Leave a Comment