భారతదేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయంలోని ప్రాణ ప్రతిష్ట జనవరి 22వ తేదీన జరగనుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా హాఫ్ డే సెలవును ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
Ayodhya: జనవరి 22న ఏరాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలవంటే..!
భారతదేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయంలోని ప్రాణ ప్రతిష్ట జనవరి 22వ తేదీన జరగనుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా హాఫ్ డే సెలవును ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంతకుముందే ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్ మరియు కొన్ని రాష్ట్రాల్లో జనవరి 22వ తేదీన సెలవును ప్రకటించాయి. చాలా రాష్ట్రాలు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్టు ప్రకటించాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న చారిత్రాత్మకమైన ఘట్టము జనవరి 22వ తేదీన జరగనుంది.
జనవరి 22వ తేదీన ఉత్తరప్రదేశ్లో పూర్తిగా సెలవుదినంగా ప్రకటించారు. పాఠశాలలు, కళాశాలలు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.. బ్యాంకులు కూడా మూతపడనున్నాయి. అందరూ ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని ఎంతో వైభవంగా దానిని తిలకించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. అయోధ్యలో రామమందిరంలో ప్రాణప్రతిష్ట కారణంగా ఇంకా చత్తీస్గడ్, గోవా, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలు మొత్తం మూసి వేయనున్నారు.. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా 22వ తేదీన సెలవు ప్రకటించే అవకాశం ఉంది.