ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులపాటు పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు.. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సెలవులు 9 నుండి 18వ తేదీ వరకు ఇచ్చారు.. పాఠశాలలు తిరిగి 19వ తేదీన ప్రారంభం కావలసి ఉండగా, ప్రస్తుతం మరో మూడు రోజులపాటు తల్లిదండ్రుల విద్యార్థుల కోరిక మేరకు పొడగిస్తున్నట్లు విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.. తిరిగి పాఠశాలలు 22వ తేదీ సోమవారం పునః ప్రారంభం అవుతాయి.. దీనికి సంబంధించిన జీవో కూడా విడుదల చేయడం జరిగింది.. అయితే తర్వాత వచ్చే ఆదివారం మరియు రెండవ శనివారం వీటికి సంబంధించి కంపల్సేటరీగా వర్క్ చేయాలని జీవోలో ఇవ్వడం జరిగింది.. ఈనెల 22వ తేదీన అయోధ్య రామ మందిరం ప్రతిష్ట ఉన్న కారణంగా ఆరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు ప్రకటించే అవకాశం కూడా ఉంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
Related Post