ap: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీఎం జగన్ నాలుగో జాబితాను విడుదల చేశారు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలు మార్పులు చేర్పులతో జాబితా విడుదలైంది. ఈ నాలుగో జాబితాను తీవ్ర కసరత్తు అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ తొమ్మిది మంది సభ్యుల పేర్లతో కూడిన నాలుగో జాబితాను గురువారం రాత్రి మీడియాకు వెల్లడించారు. రీజినల్ కో-ఆర్డినేటర్లు, ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం ఈ మేరకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27, మూడో జాబితాలో 21 స్థానాలకు ఇంఛార్జీలను ఇప్పటికే ప్రకటించడం జరిగింది .
ap politics: వైసీపీ నాలుగో జాబితా విడుదల: 9 మంది ఇంఛార్జీలు వీరే
తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జీలు వీళ్లే:
1.చిత్తూరు పార్లమెంట్ (ఎస్సీ): కె నారాయణస్వామి
2. తిరువూరు (ఎస్సీ): నల్లగట్ల స్వామిదాసు
3. జీడీ నెల్లూరు (ఎస్సీ): ఎన్ రెడ్డప్ప
4. కనిగిరి: దద్దాల నారాయణయాదవ్
5. శింగనమల (ఎస్సీ): ఎం. వీరాంజనేయులు
6. గోపాలపురం (ఎస్సీ): తానేటి వనతి (హోంమంత్రి)
7. కొవ్వూరు (ఎస్సీ): తలారి వెంకట్రావు
8. నందికొట్కూరు (ఎస్సీ)సుధీర్ ధార
9. మడకశిర(ఎస్సీ): ఈర లక్కప్ప
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటించడంలో ముందుంది. ఇప్పటికే సగం కంటే ఎక్కువ మంది అభ్యర్థులను ఖరారు చేసింది. మరోవైపు, ప్రతిపక్షాలను ఎండగడుతూ వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు మంత్రులు, వైసీపీ నేతలు ప్రజల్లోకి వెళుతున్నారు.
ఇక, టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటించేందుకు సుదీర్ఘ చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పలుమార్లు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే, బీజేపీతో కలిసి వెళ్లాలా? లేదా? అనేదానిపై ఈ రెండు పార్టీలు స్పష్టమైన నిర్ణయానికి రావడం లేదు. బీజేపీ కూడా జనసేనతో పొత్తు కొనసాగుతోందని చెబుతున్నప్పటికీ.. టీడీపీతో పొత్తుపై స్పష్టమైన ప్రకటన ఇవ్వడం లేదు. ఈ క్రమంలో అభ్యర్థులను ఖరారు చేయడంలో ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రాష్ట్రంలో ఎన్నికలు వేడి మొదలయ్యింది.. అయితే ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలను ఇచ్చింది.. దీంతో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది..
kanigiri ycp win
jai daddala narayana yadav, kanigiri