ఏపీ న్యూస్: ఆంధ్రప్రదేశ్లోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ప్రభుత్వం సంక్రాంతి సెలవల్ని మూడు రోజులు పాటు పొడిగించినట్లు నిన్న ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన సంక్రాంతి సెలవులు 18లో ముగుస్తాయి. 19వ తేదీ నుండి పాఠశాలలు తిరిగి ప్రారంభం అవ్వాల్సివుంది.. అయితే నిన్న 21వ తేదీ వరకు మూడు రోజులు పాటు సెలవులు పొడగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.. దీని ప్రకారం 22వ తేదీ సోమవారం పాఠశాలలు తిరిగి పునః ప్రారంభమవుతాయి.. అయితే అయోధ్యలో రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట 22వ తేదీ ఉన్న కారణంగా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు ఇప్పటికే 22వ తేదీన సెలవుగా ప్రకటించాయి.. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 22వ తేదీన పాఠశాలలో ప్రారంభిస్తున్నట్లు తెలపడంతో ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.. భారతీయుల దశాబ్దాల కల అయోధ్యలో ఆవిష్కృతమవుతుంటే ఆ ఘట్టాన్ని చూడడానికి విద్యార్థినీ విద్యార్థులకు అవకాశం ఇవ్వకుండా ఆరోజు పాఠశాల జరపడాన్ని ఆమె తప్పు పట్టారు.. వెంటనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 22వ తేదీన పాఠశాలకు సెలవు ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు.. మరి ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి..
ఏపీ న్యూస్: వెంటనే జనవరి 22వ తేదీన ఏపీలోని పాఠశాలలకు సెలవు ప్రకటించాలి.. దగ్గుబాటి పురందేశ్వరి డిమాండ్
Written by Rudra
Published on: