ఎన్నో అంచనాలతో ఈ రోజు అనగా డిసెంబర్ 22న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన “సలార్” పార్ట్ వన్ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.. దీనికి అదిరిపోయే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.. ప్రభాస్ కటౌట్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు..
సలార్: సలార్ మొదటి రోజు కలెక్షన్లు ఎంతంటే??
ఎన్నో అంచనాలతో ఈ రోజు అనగా డిసెంబర్ 22న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన “సలార్” పార్ట్ వన్ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.. దీనికి అదిరిపోయే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.. ప్రభాస్ కటౌట్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.. అయితే మొదటిరోజు ప్రపంచ వ్యాప్తంగా సలార్ మూవీ 175 కోట్లకు పైగా రాబట్టినట్లు తెలుస్తుంది.. ఈ సినిమా భారతదేశం మొత్తం మీద అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 60 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తుంది..
ఈ ఏడాదిలో మొదటి రోజే అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీ ఇదేనిని చెబుతున్నారు.. శని,ఆదివారాల వరకు అన్ని థియేటర్లలో ఈ సినిమా టికెట్లు అన్ని అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి.ఈ సినిమాలో ప్రభాస్,శృతి హాసన్, పృధ్విరాజ్, జగపతి బాబు నటించగా kgf డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు.. ఇండస్ట్రీ రికార్డులను మరోసారి షేక్ చేసేలా ఈ సినిమా కలెక్షన్లు ఉన్నాయి..