ఇటీవల ప్రకటించిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గడ్ లలో బిజెపి ఘనవిజయం సాధించింది. తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించి ఇప్పటికే ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛతీస్ఘడ్ రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్న ఇంకా సీఎం మాత్రం ప్రకటించలేదు,
ఫలితాలు వచ్చి వారం.. అయినా మూడు రాష్ట్రాల్లో తేలని సీఎం అభ్యర్థులు..
ఇటీవల ప్రకటించిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గడ్ లలో బిజెపి ఘనవిజయం సాధించింది. తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించి ఇప్పటికే ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛతీస్ఘడ్ రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్న ఇంకా సీఎం మాత్రం ప్రకటించలేదు, దీంతో జాతీయ కాంగ్రెస్ పార్టీ బిజెపిపై విమర్శలు గురిపిస్తుంది. ఆ మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణ ఫలితాలు కూడా వెలువడ్డాయని అక్కడ సీఎంతో పాటు, మంత్రులు ఎంపిక మరియు పథకాలు కూడా అమలు జరుగుతున్నాయని, కానీ ఈ మూడు రాష్ట్రాల్లో సీఎంలు ఎవరు అనేది ఇంకా తేరలేదని విమర్శిస్తుంది. కౌన్ బనేగా కరోడ్పతి లాగే కౌన్ బనేగా సీఎం ఎవరు అని కాంగ్రెస్ బిజెపిపై విమర్శలు కురిపిస్తుంద. అయితే సీఎం పదవికి ఈ మూడు రాష్ట్రాల్లో పోటీలు తీవ్రంగా ఉండడంతో బిజెపి ఆచితూచి వ్యవహరించడం జరుగుతుంది.
అయితే దీనికి సమాధానంగా తన మనవమరాల్లతో చెస్ ఆడుతున్న ఫోటోను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా షేర్ చేసి “ఒక మంచి ఎత్తుగడతో ఆగిపోకండి. ఎప్పటికీ ఉత్తమమైన వాటికోసం చూడండి” అని టాగ్ లైన్ ఇచ్చారు. ఈ మూడు రాష్ట్రాల సీఎంల ఎంపికలో జాప్యంపై వస్తున్న విమర్శలకు కౌంటర్ గానే అమిత్ షా ఈ పోస్ట్ చేసినట్లు తెలియ వస్తుంది.