ప్రముఖ OTT ఫ్లాట్ ఫామ్ లో మంగళవారం మూవీ స్ట్రీమింగ్.. వెంటనే చూసేయండి..

Written by Rudra

Published on:

ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయి మంచి హిట్ సాధించిన హారర్ థ్రిల్లర్ మూవీ “మంగళవారం”. ప్రస్తుతం ఈ మూవీ  ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది..  దాని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Mangalavaram: సస్పెన్స్ థ్రిల్లర్ "మంగళవారం" మూవీ ఓటీటీ లోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ..  

ప్రముఖ OTT ఫ్లాట్ ఫామ్ లో మంగళవారం మూవీ స్ట్రీమింగ్.. వెంటనే చూసేయండి..

ఇప్పటివరకు కథానాయకగా  గ్లామరస్ పాత్రలే చేసిన పాయల్ రాజ్ పుత్  హారర్,  థ్రిల్లర్ కంటెంట్ తో  ఆడియన్స్ ముందుకు వచ్చింది.. పాయల్ ప్రధాన పాత్రలో నటించిన  మంగళవారం సినిమా నవంబర్ 17వ తేదీన థియేటర్లలో విడుదలైంది.  దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీనికి ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించారు.  హీరోయిన్ గా పాయల్  మొదటి సినిమా ఆర్ఎక్స్ 100లో  నెగిటివ్ షెడ్ ఉన్న పాత్రలో నటించింది..  ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.. తన గ్లామర్ మరియు నటనతో ప్రేక్షకులను మెప్పించింది. తరువాత వెంకీ మామ సినిమాలో వెంకటేశ్ సరసన నటించింది. ఆ తర్వాత తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. ఆమె నటించిన కొన్ని సినిమాలు అంతగా ప్రేక్షకులు అలరించలేకపోయాయి.

Mangalavaram: సస్పెన్స్ థ్రిల్లర్ "మంగళవారం" మూవీ ఓటీటీ లోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ..  

అయితే ప్రస్తుతం పాయల్ నటించిన మంగళవారం  సినిమా మంచి విజయ సాధించింది.. ఇప్పుడు ఈ సినిమా  ఓటీటీ  ప్లాట్ ఫామ్ అయినా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది..  థియేటర్లో ఈ సినిమా చూడని వాళ్ళు ఇంట్లోనే టీవీ లేదా మొబైల్లో  మూవీని చూడవచ్చు. ఈ సినిమా తెలుగుతోపాటు తమిళము, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ తోడు హారర్ థ్రిల్లర్ ఉండడంతో ఈ సినిమా మంచి హిట్ అయింది.

Mangalavaram: సస్పెన్స్ థ్రిల్లర్ "మంగళవారం" మూవీ ఓటీటీ లోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ..  

సినిమా కథ విషయానికి వస్తే  ఒక గ్రామంలో మరణాలు సంభవిస్తుంటాయి.  అయితే అవి మంగళవారం మాత్రమే జరుగుతుండడం.. అవి ఆత్మహత్యలు కాదు హత్యలని పోలీసులు అనుమానం కలవడం..  వీటికి హీరోయిన్ ఉన్న సంబంధం ఏంటి అనేది ఈ మంగళవారం సినిమాలోని కథ.. ఈ చిత్రానికి అజ్నీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.. ఈ మూవీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది. దీనిలో అజ్మల్ అమీర్, దివ్య పెళ్లై, నందితా శ్వేత, రవీంద్ర విజయ్ కీలక పాత్రలు పోషించడం జరిగింది. ఇక ఆలస్యం దేనికి ఈ సినిమాను  డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వెంటనే చూసేయండి..

apnewshub.com 

Leave a Comment