Flipkart Mobile Bonanza Sale : కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మరో సేల్ మొదలైంది. గత నెలలో దీపావళి సేల్ ముగిసిన కొన్ని వారాల తర్వాత కొత్త ఫ్లిప్‌కార్ట్ బొనాంజా సేల్ ప్రారంభమయింది . ఈ సేల్ డిసెంబర్ 6 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సందర్భంగా చాలా స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అందులో శాంసంగ్ గెలాక్సీ ఎం14, పోకో ఎక్స్5 ప్రో, మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ 2023 దీపావళి సేల్ మాదిరిగా లేటెస్ట్ సేల్ ఫోన్లపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. నథింగ్ ఫోన్ (2), శాంసంగ్ గెలాక్సీ ఎం14, పోకో ఎక్స్5 ప్రో వంటి ఫోన్లపై కూడా ఆకర్షణీయమైన తగ్గింపులను పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ సేల్.. స్మార్ట్ఫోన్లపై తగ్గింపు :
భారత మార్కెట్లో పోకో ఎక్స్5 ప్రో మోడల్ రూ. 22,999 ధరకు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ సమయంలో ఈ ఫోన్ భారీ తగ్గింపుతో ధర రూ. 18,999కి అమ్మకానికి ఉంది. అంటే రూ. 4వేల తగ్గింపును ఇస్తోంది. రూ. 30వేల నుంచి రూ. 40వేల ధరల శ్రేణిలో ఏ ఫోన్లోనూ హై-ఎండ్ స్నాప్‌డ్రాగన్ 778జీ చిప్‌సెట్‌ను అందించడం లేదు. కానీ, ప్రస్తుతం రూ. 20వేల లోపు అత్యుత్తమ 5G ఫోన్లలో పోకో ఎక్స్ 5 ప్రో మోడల్ ఇదొకటిగా చెప్పవచ్చు.
మరెన్నో ఆకర్షణీయమైన బ్యాంకు ఆఫర్లు :
ఫ్లిప్‌కార్ట్ ద్వారా నథింగ్ ఫోన్ (2)ని రూ. 39,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ 5జీ డివైజ్ ఈ ఏడాది ప్రారంభంలో రూ. 44,999కి లాంచ్ అయింది. అంటే.. నథింగ్ ఫోన్ (2)పై రూ. 5వేలు ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే అదనంగా 10 శాతం తగ్గింపు కూడా పొందవచ్చు. ఇక ఎందుకు ఆలస్యం!! కొత్త ఫోన్ కొనాలనుకున్నవారికి మంచి అవకాశం. apnewshub.com
Super nice information. Thank u AP news hub team. Very fast updates on your site. I wish u congrats to success your journey of updating news across globe.