తెలుగు రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసులు ఎన్నంటే!!

Written by Rudra

Published on:

తెలుగు రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసులు ఎన్నంటే!!

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరగడం, కేరళ రాష్ట్రంలో కొత్త వేరియంట్ వెలుగుచూసిన దరిమిలా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అమెరికాలో అలజడి సృష్టించిన కరోనా కొత్త వేరియంట్‌.. ఇప్పుడు భారతదేశంలోనూ కలకలం రేపుతోంది. కరోనా మహమ్మారి ఎక్కడో ఒక చోట ఏదో కేసు రూపంలో నమోదై హడలెత్తిస్తుండటం ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది.

అయితే ఆల్రెడీ తెలంగాణలోకి వచ్చిన కరోనా ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోకి కూడా వచ్చేసింది… ఏపీ ప్రభుత్వం కూడా ఇక అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులు కొత్త వేరియంటా లేదా పాత వేరియంటా అనేది తెలియాల్సిఉంది. దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 328 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో యాక్టివ్ కేసులు సంఖ్య 2997 కి పెరిగింది. అయితే కేరళలో ఒకరు చనిపోవడం జరిగింది.. బీహార్ లో 2 కేసులు, ఆంధ్రప్రదేశ్లో 3 కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ వెల్లడించింది..

కరోనా కొత్త పేరు JN -1.  ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం కొత్త వేరియంట్ అంత ప్రమాదకారి కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడం వల్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వారాంతరాలు, క్రిస్మస్, నూతన సంవత్సర సెలవులు కాబట్టి వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. జన సమర్థం ఉన్నటువంటి ప్రదేశాల్లో మాస్కులు ఖచ్చితంగా వాడాలని చెబుతున్నారు..

apnewshub.com

Leave a Comment