ఇటీవల మీచౌంగ్ తుఫాన్ కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు.. తుఫాన్ కారణంగా దెబ్బ తిన్న పంటలు, రంగు మారిన వరి ధాన్యం కొనుగోలు పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
APలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం.. సీయం ఆదేశం..
ఇటీవల మీచౌంగ్ తుఫాన్ కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు.. తుఫాన్ కారణంగా దెబ్బ తిన్న పంటలు, రంగుమారిన వరి ధాన్యం కొనుగోలుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈరోజు సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో అధికారులతో జరిగిన సమీక్షలో రంగు మారిన మరియు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. ఆర్బికెల ద్వారా పంటలు కొనుగోలు చేయాలని, పంట నష్టపోయిన రైతులకు పంట బీమా ద్వారా పరిహారం అందించాలని తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 18 వరకు పంట నష్టాన్ని అంచనా వేయాలని తెలిపారు. ఈనెల 26 నాటికి పంట నష్టం తుది నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.. వచ్చే నెలలో సాయాన్ని రైతులకు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఇటీవల తుఫాను ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి సందర్శించారు. సహాయక చర్యలపై బాధితులను అడిగి తెలుసుకున్నారు.